Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాంక్ గ్రౌండ్ లేకపోయినా టాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ను బిల్డ్ చేసుకున్న అతి తక్కువ మంది హీరోల్లో నాని ఒకరు. గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న నాని.. ఇటీవలె `శ్యామ్ సింగరాయ్`తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు.
ప్రస్తుతం సక్సెస్ జ్యోష్లో ఉన్న నాని.. `అంటే.. సుందరానికీ!`తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఇందులో మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ హీరోయిన్గా నటించింది. మంచి అంచనాలు ఉన్న ఈ మూవీ జూన్ 10న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల గ్రాండ్ రిలీజ్ కానుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సైతం ఆయన పంచుకున్నారు. ఈ క్రమంలోనే తాను సినిమాల్లోకి రాకపోయుంటే ఏం పని చేసేవాడినో కూడా వివరించారు.
నాని మాట్లాడుతూ.. సినిమా రంగంలోకి రాకపోయుంటే థియేటర్లో టికెట్ కలెక్టర్ అయ్యుండేవాడినని, ఎందుకంటే ప్రతి షో ఫ్రీగా చూసేయోచ్చు కదా అటూ సరదాగా చెప్పుకొచ్చారు. అలాగే `అంటే.. సుందరానికీ` సినిమా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందని కూడా ధీమా వ్యక్తం చేశాడు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!