Prabhas: తెలుగు చలనచిత్ర రంగంలో కృష్ణంరాజు ఫ్యామిలీ ప్రత్యేకమైన మర్యాద కలిగినదని చాలామంది చెబుతూ ఉంటారు. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్లు కడుపు.. నింపనిదే.. ఆతిథ్యం ఇవ్వనిదే.. బయటకు పంపించారని చెబుతుంటారు. అదే అలవాటు ప్రభాస్ లో ఉందని కూడా చెబుతారు. ప్రభాస్ అందరితో కలిసిపోయే మనిషి అని అంటారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్స్ జరుగుతున్న క్రమంలో సెట్స్ లో అందరికీ ఇంటి నుండే.. ఎవరికి కావాల్సింది వారికి రకరకాల కూరలు వంట చేయించి మరి.. భోజనాలతో ప్రేమను నింపేస్తాడని చెబుతారు. ఇదిలా ఉంటే ప్రభాస్ కి అత్యంత దగ్గర స్నేహితులలో ఒకరు ప్రభాస్ శ్రీను. ఈ క్రమంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ శ్రీను.. కృష్ణంరాజు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆయన తనకు దేవుడు లాంటి వారిని చెప్పుకొచ్చారు. వయసులో చాలా పెద్దవారైనా గానీ సరదాగా.. మాట్లాడుతూ ఎంతగానో ఇష్టపడతారని పేర్కొన్నారు. ఆయనంటే ఎనలేని గౌరవం ప్రేమ అని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. కృష్ణంరాజు ప్రభాస్ ఇద్దరు కూడా ఎంతో గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాళ్లు అయినా గాని సింపుల్ గా కలిసిపోతారని తెలిపాడు. కృష్ణంరాజు మృతి తీరని లోట్టు అని ప్రభాస్ శ్రీను స్పష్టం చేశారు. ఆయన ఇంటిలో ఉన్న సమయంలో ఆయన తనని మంత్రి అని పిలిచేవారని అన్నారు. ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరిస్తూనే సరదాగా నవ్విస్తూ ఉంటారు. కృష్ణంరాజు గారు అంటే మరోపక్క భయం భక్తి కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు.
ఇక ప్రభాస్ మూడ్ బట్టి ఉంటాడని దానికి అనుగుణంగానే తాను కూడా వ్యవహరిస్తానని ప్రభాస్ శ్రీను స్పష్టం చేశారు.ప్రభాస్ కి కోపం వస్తే.. అసలు మాట్లాడడు అది ఇంకా చాలా టార్చర్ గా ఉంటుంది. ఏది ఏమైనా ఇంటికి ఎవరైనా వస్తే మాత్రం కచ్చితంగా భోజనం చేసి వెళ్ళాలి అనేది కృష్ణంరాజు గారి ఫ్యామిలీలో ఉండే మర్యాద అంటూ ప్రభాస్ శ్రీను కొత్త విషయాన్ని తెలియజేశారు. ఇదిలా ఉంటే గత ఏడాది కృష్ణంరాజు మరణించడంతో పెదనాన మరణాన్ని ప్రభాస్ జీర్ణించుకోలేకపోయారు. ఎంతో తల్లడిల్లిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఇంటికి పరిమితమైన ప్రభాస్ మళ్ళీ సినిమా షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ “సలార్” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.