అమ్మ రాజశేఖర్ డబ్బు ఎగరగొట్టాడు.. నోటి దురుసు ఎక్కువ: యాక్టర్ సమీర్

Share

బిగ్ బాస్ 4 సీజన్ చాలా వివాదాస్పందంగా మారుతోంది. ముఖ్యంగా నెటిజన్లు బిగ్ బాస్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే..అయితే బిగ్ బాస్ హౌస్ లో అమ్మా రాజశేఖర్ గంగవ్వ వెళ్లిపోయినప్పటి నుంచి పెద్దమనిషిగా ప్రవర్తిస్తున్నారు. అందరితో క్లోజ్ గా మెలుగుతున్నాడు. కాని బిగ్ బాస్ హౌస్ లో ఒకరి జోలి మరొకరి చెప్పి వారి జోలి వేరే వారికి చెప్పి పుల్లలు పెడుతున్నాడు అమ్మా రాజశేఖర్. ముఖ్యంగా టాస్క్ లు, ఎలిమినేషన్ వచ్చినప్పుడు అతని రియల్ క్యారెక్టర్ ను బయటపెట్టేస్తున్నాడు.

బిగ్ బాస్ లో కి వచ్చిన మొదట్లో తన కామెడీతో అందరినీ నవ్వించిన విషయం తెలిసిందే..అలా నవ్విస్తూ ఉండే అమ్మా రాజశేఖర్ ఇప్పుడు జనాల నుంచి కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంటున్నాడు. అయితే తన గురించి తాను గొప్పగా చెప్పుకునే అమ్మా రాజశేఖర్ గురించి జబర్దస్త్ పవన్ అమ్మా రాజశేఖర్ అసలు రూపాన్ని బయటపెట్టాడు. తనకు ఇండస్ట్రీలో అవకాశాలు కల్పిస్తానని ఇంట్లో పనులు చేయించుకుని చివరికి మోసం చేశాడని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా సీరియల్ హీరో..సీనియర్ నటుడు సమీర్ హాసన్ కూడా అమ్మా రాజశేఖర్ గురించి కొన్ని నిజాలను కూడా బయటపెట్టాడు.

ఎన్నో ఏండ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా డబ్బు గురించి ఏనాడు పెద్దగా పట్టించుకోలేదని సమీర్ తెలిపారు. కాగా కొరియోగ్రాఫర్, డైరెక్టర్ అమ్మా రాజశేఖర్ మాత్రం నన్ను అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశారు.. యాక్టర్ సమీర్ హాసన్. ఆయన చెప్పినట్టే వినాలి.. సడెన్ గా ఫోన్ చేసి అడుగుతారు.. చెప్పిన వెంటనే ఓకే చెప్పెయ్యాలి.. లేకపోతే అవమానిస్తారు. వేరే షూటింగ్ లో ఉన్నా అని చెబితే.. నేను డబ్బులు ఇవ్వలేదని రావట్లేదా.. అని తన మాటలతో బాధపెడతారని సమీర్ తన భావాలను వ్యక్తపరిచారు.

కాని నేను డబ్బుల గురించి ఏ నాడు పట్టించుకోలేదని, డిమాండ్ కూడా చేయలేదని ఈ విషయం అందరికీ తెలుసని తెలిపారు. ఎన్నో సినిమాల్లోనూ, సీరియల్లోనూ పనిచేసినా నన్ను ఎవరూ ఇలా అనలేదని ఫీల్ అయ్యారు. ఆయన తన మాటలతో నన్ను చాలా బాధపెట్టారు. అందుకే ఆయన సినిమా నుంచి తప్పుకున్నానని తెలిపారు. అమ్మా రాజశేఖర్ నాతో క్లోస్ గా మూవ్ అయినప్పటికీ మా మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వచ్చందని సమీర్ హాసన్ తెలిపారు.


Share

Related posts

సమంత హీరోయిన్ కెరీర్ కి ఫుల్ స్టాప్ ?? ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ ?

Naina

వార్నీ.. యాంకర్ సుమ, రవిలో ఈ టాలెంట్ కూడా ఉందా?

Varun G

‘డైనింగ్ టేబుల్’పై ఈ పాత్రలు వాడితే లావైపోతారట.. ఎందుకంటే?

Teja