Surya: కీలక సమయంలో ఫ్యాన్స్ ని ఆదుకున్న స్టార్ హీరో సూర్య..!!

Share

Surya: ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. వైరస్ అరికట్టడానికి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు ఇంటికి పరిమితం కావడంతో… ఉపాధి లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో దేశంలో చాలా మంది సెలబ్రిటీలు అదేవిధంగా సినిమా హీరోలు ప్రభుత్వాలకు విరాళాలు ప్రకటిస్తూనే మరోపక్క పేదవాళ్లనీ ఆదుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కరోనా బారిన పడిన రోగులను కాపాడటం కోసం ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ట్రీట్ మెంట్ విషయంలో అదే రైతులు ఆక్సిజన్ సిలిండర్లు అందించడంలో ముందడుగు వేస్తున్నారు.

Next single from Surya's Soorarai Pottru will be released by March 10: G V Prakash- Cinema express

ఇటువంటి తరుణంలో తమిళ ఇండస్ట్రీ స్టార్ హీరో సూర్య అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి భారీగానే విరాళం ప్రకటించడం మనకందరికీ తెలిసిందే. కానీ తాజాగా తనను అభిమానించే అభిమానుల సంఘాలను ఆదుకోవడానికి.. ముందడుగు వేశారు. దాదాపు పదమూడు లక్షలకు పైగానే డబ్బులు ఖర్చు పెడుతూ ఆయా సంఘాలకు ఐదు వేల రూపాయల చొప్పున సూర్య అందించడం జరిగింది.

Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు ఎవరు ప్ర‌క‌టించారో తెలుసా?

కరోనా నేపథ్యంలో బయట పనులు లేక అభిమానులు కుటుంబాలతో అవస్థలు పడుతూ ఉండటం తో ఈ విషయం తన దృష్టికి రావడంతో సూర్య వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తెలిసిన మరుక్షణం డబ్బులను ఆయా సంఘాలకు అందించటం జరిగిందట. ఇదే తరహాలో తమిళంలోనూ మరికొంతమంది హీరోలు తమ ఫ్యాన్స్ అసోసియేషన్ సంఘాలను ఆదుకోవటానికి రెడీ అయినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకపక్క ప్రభుత్వానికి అండగా ఉంటూ మరోపక్క అభిమానులను ఆదుకుంటూ తమిళ్ హీరోలు కరోనా కష్టకాలంలో బాసటగా నిలుస్తున్నారు. 


Share

Related posts

బిగ్ బాస్ 4 : గంగవ్వా నువ్వు వస్తే చాలు ‘ ఇంత అమౌంట్ ‘ ఇస్తాం అంటున్న మాటీవీ ??

Varun G

నిమ్మగడ్డ ఎస్ఈసీగా చేరినా.. చుట్టూ సవాళ్లే..!

Muraliak

రామ్ గోపాల్ వర్మ సరికొత్త కామెంట్స్ తో మారబోతున్న దేశ రాజకీయం..!!

sekhar