కరోనా రాకముందు ప్రతి ఒక్క సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల అలరించేవని చెప్పవచ్చు. కానీ కరోనా కారణం వల్ల థియేటర్లు మూతపడటంతో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు వారి సినిమాలు అన్ని”ఓటీటీ”వేదికగా విడుదలయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే సినిమా విజయవంతం కావాలంటే అది విడుదల కావాల్సి ఉంది థియేటర్లలోనూ, ఓటీటీ అనే దానిపై ఆధారపడి ఉండదని, కంటెంట్ బాగుంటే ఎక్కడైనా విజయాన్ని అందుకుంటాయని తాజాగా ఎన్నో సినిమాలు “ఓటీటీ”ద్వారా విడుదల అయి నిరూపించాయి.
అంతేకాకుండా తన కెరీర్లో స్టార్డమ్ లేనప్పటికీ “ఓటీటీ” ద్వారా స్టార్డమ్ సంపాదించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రతిక్ గాంధీ, పంకజ్ త్రిపాఠి, జైదీప్ అహ్లవత్ ముందువరుసలో ఉంటారు. వీరు నటించిన సినిమాలు “ఓటీటీ”ద్వారా విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ పొందడంతో ఉన్నఫలంగా స్టార్ హీరోలుగా పాపులర్ అయ్యారు.
వెబ్ సిరీస్ లను చూడటం అలవాటు ఉన్న వారికి వీరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా రావటం వల్ల సినిమాలన్నీ “ఓటీటీ”ద్వారా విడుదల కావడంతో ఈ ఫ్లాట్ ఫామ్ ఎంతో మందికి అవకాశం కల్పించిందని చెప్పవచ్చు.మీర్జాపూర్, క్రిమినల్ జస్టిస్, పంచాయత్, పాతాళ్ లోక్, ఆర్య, స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ వంటి ఎన్నో సినిమాలు ఇందుకు మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ సినిమాలు మంచి విజయం సాధించడం ద్వారా తెరవెనుక ఉన్న ఎంతోమంది టాలెంట్ బయట పడిందనే చెప్పవచ్చు.
“మీర్జాపూర్” సినిమాలో నటించిన పంకజ్ త్రిపాఠి.. ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నప్పటికీ దేశవ్యాప్త గుర్తింపు తెచ్చింది మాత్రం మీర్జాపూర్. ప్రస్తుతం సోషల్ మీడియాలో పంకజ్ త్రిపాఠి వీడియోలు, డైలాగులు వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మంచి కథతో పాటు సృజనాత్మకత కూడా ఎంతో ఉండాలి. అప్పుడే మంచి విజయం పొందవచ్చని పంకజ్ త్రిపాఠి తెలిపారు. అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన మీర్జాపూర్ ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పవచ్చు.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…