Anjali: తెలుగమ్మాయి అయినప్పటికీ మొదట కోలీవుడ్‌లో గుర్తింపు సంపాదించుకున్న అంజలి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `డేర్` అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన అంజలి.. టాలీవుడ్లోకి `ఫొటో` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన షాపింగ్‌మాల్, జర్నీ చిత్రాలు ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యాయి.
దాంతో విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`లో అవకాశాన్ని అందుకుంది. ఈ మూవీలో సీతగా నటించి టాలీవుడ్లో సూపర్ క్రేజ్ దక్కించుకుంది.
అయితే అందం, అభినయం అంతకు మంచి టాలెంట్ ఉన్నప్పటికీ సరైన హీట్స్ పడక పోవడం వల్ల ఈ భామ స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అంజలి.. తాజాగా టాప్ యాంగిల్ నుంచి హాట్ హాట్‌గా పోజులిస్తూ సెల్ఫీలు దిగింది.
ఆపై అందుకు సంబంధించిన పిక్స్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయగా.. అవి కాస్త నెటిజన్లను ఆకట్టుకుంటూ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇకపోతే అంజలి ప్రస్తుతం రామ్ చరణ్‌గా హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న `ఆర్సీ 15` మూవీ షూటింగ్లో పాల్గొంటోంది.
రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి, సునీల్, నవీన్ చంద్ర కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంజలి షూట్లో పాల్గొంటోంది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!