ప్రముఖ సినీ నిర్మాత వేధింపులకు గురయ్యానంటున్న నటి!

బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అయిన మహేష్ భట్ తనని ఎంతో మానసికంగా వేధించాడని నటి లువియానా  లోధ్ మహేష్ భట్ పై తీవ్రఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన నుంచి నా కుటుంబానికి, నాకు ప్రాణహాని ఉందని ఆమె పేర్కొన్నారు. తను వివాహం చేసుకున్న సుమిత్‌ సబర్వాల్‌ మహేష్ భట్ కి బంధువు. కొన్ని గొడవల కారణంగా సుమిత్ తో ఇటీవలవిడాకులు కావాలని లూవియానా కోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలోనే నిర్మాత అయిన మహేష్ భట్ తీవ్ర విమర్శలు చేస్తూ ఒక వీడియోను తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఆ వీడియోను షేర్ చేశారు. దాదాపు రెండు నిమిషాలు సమయం పాటు ఉన్న ఈ వీడియోలో లువియానా మహేష్ భట్ పై తీవ్ర విమర్శలు చేశారు. మహేష్ భట్ బంధువైన సుమిత్‌ సబర్వాల్‌ను కొంతకాలం క్రితం నేను పెళ్లి చేసుకున్నాను. కానీ సుమిత్ కు పలువురు హీరోయిన్లతో కలసి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నాడు అన్న విషయం తెలియడంతో, అతనితో గొడవపడి విడాకులు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించారు.

అయితే ఈ విషయాలన్నీ కూడా మహేష్ బట్ కి తెలుసు. సినీ పరిశ్రమలో ఆయన ఒక పెద్ద పేరున్న నిర్మాత. ఈయన చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ మొత్తం నడుస్తుంది. ఎటువంటి సమస్య అయినా ఒక్క ఫోన్ తోనే ఆ సమస్యను పరిష్కరిస్తారు. అంతటి పేరున్న నిర్మాత మహేష్ భట్ ఆయన చెప్పినట్లు వినకపోతే సినీ పరిశ్రమలు వారిని అగాధంలోకి తొక్కేస్తారు. అయితే మా ఇంటి నుంచి కూడా నన్ను బయటకి వెళ్లకొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.

ఈ విషయమై గతంలో ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదనీ ఆమె తెలియజేశారు. ప్రస్తుతం ఈ వీడియో చేయడానికి కారణం మహేష్ భట్, సుమిత్‌ సబర్వాల్‌ నుంచి నాకి, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని ఒకవేళ నాకు నా కుటుంబానికి ఏమైనా జరగరాని ప్రమాదం జరిగితే అందుకు కారణం నిర్మాత మహేష్ భట్, సుమిత్,సాహెల్‌ సెహగల్‌, కుంకుమ్‌ సెహగల్‌ వీరే కారణమని లువియాన తన వీడియోలు పేర్కొన్నారు.