సినిమా

Meena: బేబీ బంప్‌తో ద‌ర్శ‌న‌మిచ్చిన మీనా.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Share

Meena: సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చెన్నైలో జ‌న్మించిన ఈ అందాల భామ‌ బాలనటిగా ఎన్నో సినిమాలు చేసి త‌న‌దైన న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ త‌ర్వాత ఈమె `న‌వ‌యుగం` అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది. రాజేంద్ర ప్ర‌సాద్ హీరోగా ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం 1991లో విడుదలైంది.

ఆపై ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హోదాను ద‌క్కించుకుంది. అప్పట్లో టాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లోని అగ్రహీరోలందరి సరసన ఆడిపాడిన మీనా.. మ‌ల‌యాళ భాష‌లోనూ ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాలు చేసింది. ఇక కెరీర్ స్లో అవుతున్న త‌రుణంలో ఈమె వైద్య రంగంలో రాణిస్తున్న సాగర్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి నైనిక అనే కూతురు జ‌న్మించింది.

పెళ్లి చేసుకున్న అనంత‌రం సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మైన మీనా.. మ‌ళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నారు. తల్లి, అక్క పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గ‌తేడాది ‘దృశ్యం 2’, ‘పెద్దన్న’ లాంటి పెద్ద చిత్రాలతో ఆక‌ట్టుకున్న మీనా.. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె బేబీ బంప్‌తో ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో మ‌ళ్లీ మీనా ఏమైనా త‌ల్లైందా..? అంటూ నెటిజ‌న్లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కొంద‌రు ఓ అడుగు ముందుకేసి ఆమెకు కంగ్రాట్స్ కూడా చెప్పేస్తున్నారు.

కానీ, అస‌లు విష‌యం ఏంటంటే.. మీనా ప్ర‌స్తుతం ఒక సినిమాలో ప్రెగ్నెంట్ లేడీ పాత్ర‌ను పోషిస్తోంది. ఆ పాత్ర‌కు సంబంధించిన లుక్‌నే మీనా అంద‌రితోనూ పంచుకుంది. `ఒకప్పుడు ప్రెగ్నెంట్ గెట‌ప్ వేసుకోవడం చాలా ఈజీగా ఉండేది. అప్పట్లో క‌డుపును కవర్ చేసుకోవడానికి హెవీ చీరలను ధరించేవాళ్లం. కానీ, ఇప్పుడు షిఫాన్‌ చీరలు కట్టుకున్నా చూడటానికి చాలా నాచురల్‌గా ఉంది.` అంటూ త‌న వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. దీంతో ఇప్పుడీ వీడియో కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/reel/Ccc7kAEOQnL/?utm_source=ig_web_copy_link


Share

Related posts

క‌మ‌ల్‌తో సై అంటున్న బాలీవుడ్ స్టార్‌

Siva Prasad

చిరంజీవి ‘హిట్లర్’ కు 24 ఏళ్లు..! ఇన్నేళ్లకో చిన్న మ్యాజిక్ జరుగుతోందిగా..!

Muraliak

మహేష్ బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది ..సర్కారు వారి పాట నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ ..!

GRK