Actress Pragathi: టాలీవుడ్ నటి ప్రగతి అందరికీ సుపరిచితురాలే. చాలా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించడం జరిగింది. హీరో మరియు హీరోయిన్ లకు తల్లి పాత్రలలో మెప్పించింది. ప్రగతి తన సహజ నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటది. 40కి పైగా వయసు కలిగిన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటది. నాలుగు పదుల వయసులో అందంగా కనబడటం మాత్రమే కాకుండా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటది. 21 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్న ప్రగతి పొన్నాలకే భర్తతో విడాకులు తీసుకుని పిల్లలతో విడిగా ఉంటున్నారు.
సినిమా మరియు కుటుంబం మినహా మరో ప్రపంచం గురించి ప్రగతి ఎక్కువగా ఆలోచించదు. అటువంటిది ప్రగతి రెండో పెళ్లి గురించి గత కొంతకాలంగా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆమె రెండో పెళ్లి గురించి ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఒక స్టార్ ప్రొడ్యూసర్ ని ప్రగతి రెండో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు వార్తల వైరల్ అవుతున్నాయి. గతంలో మొదటి పెళ్లి గురించి తెలిసి తెలియని వయసులో చేసుకుని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే.
అయితే ఆ సమయంలో రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి కాదు గాని కంపెనీయాన్ ఉంటే బాగుంటదని.. చాలాసార్లు అనుకున్నాను. అయినా నా మెచ్యూరిటీ లెవెల్ కి దొరకటం చాలా కష్టం. కానీ రావాలని ఉంటే మాత్రం అదే జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాను. నా వ్యక్తిగత విషయాల్లో కొన్నిటిలో పర్టికులర్ గా ఉంటాను. 20 ఏళ్ల వయసులో అయితే అడ్జస్ట్ అయ్యేదాన్ని ఇప్పుడు మాత్రం చాలా కష్టమని అప్పట్లో రెండో పెళ్లి గురించి ప్రగతి కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రగతి వయసు 47. అయితే తాజాగా తెలుగు ఇండస్ట్రీలోనే ఒక స్టార్ ప్రొడ్యూసర్ తో రెండో పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.