Rambha: సీనియర్ స్టార్ హీరోయిన్, కుర్రాళ్ళ రాకుమారి రంభ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయవాడలో పుట్టిన ఈ అందాల భామ.. `ఆ ఒక్కటి అడక్కు` చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఫస్ట్ మూవీలోనే గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ.. తన అందచందాలతో, మైమరపించే నటన, డ్యాన్స్‌తో టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ భాషల్లో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది.
అయితే సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న తరుణంలో రంభ మలేషియాకు చెందిన వ్యాపారవేత్త ఇంద్ర కుమార్‌ను 2010లో వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు జన్మించారు. ప్రస్తుతం రంభ ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలో నివాసం ఉంటోంది. ఇక పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైన రంభ.. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తమిళ్ స్టార్ హీరో కార్తి ప్రస్తుతం ‘సర్దార్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పిఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, రజిషా వియన్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అలాగే ఈ మూవీలో కార్తి మున్నెప్పుడూ చూడని డిఫెరెంట్ మేకోవర్‌తో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ రంభను సంప్రదించారట. తన పాత్రకు మంచి ప్రాధన్యత ఉండటంతో.. రంభ వెంటనే ఓకే చెప్పిందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే చిత్ర టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!