సినిమా

Samantha: ఆ రెండు నాకొద్దు.. స‌మంత అంత మాట‌నేసిందేంటి?

Share

Samantha: స‌మంత‌.. ఈమె గతం గురించి అంద‌రికీ తెలుసు. యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌ను దాదాపు ఆరేళ్లు ప్రేమించి, ఆపై పెద్ద‌ల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకుంది. కానీ, వివాహ‌మై నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే ఈ జంట త‌మ వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికి.. ఎవ‌రి దారులు వారు చూసుకున్నారు.

ప్ర‌స్తుతం ఒంట‌రిగానే జీవిస్తున్న స‌మంత‌.. త‌న దృష్టి మొత్తం కెరీర్‌పైనే పెట్టి సౌత్‌తో పాటు నార్త్‌లోనూ వ‌రుస ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్‌ చేస్తోంది. అలాగే ఈమె న‌టించిన త‌మిళ్ చిత్రం `కాతువాక్కుల రెండు కాదల్‌(తెలుగులో కన్మణి రాంబో ఖతీజా)` ఏప్రిల్ 28న విడుద‌లైంది. ఇందులో విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌టించ‌గా.. న‌య‌న‌తార మ‌రో హీరోయిన్‌గా మెరిసింది.

samantha

మంచి అంచ‌నాల మ‌ధ్య వచ్చిన ఈ చిత్రం తొలిరోజే మిశ్ర‌మ స్పంద‌న ద‌క్కించుకుంది. అయితే ఈ సినిమాను కాస్త ప్ర‌మోట్ చేసేందుకు తాజాగా స‌మంత త‌న ఫాలోవ‌ర్స్‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా చిట్ చాట్ చేసింది. ఈ చిట్ చాట్ సెష‌ల్‌లో నెటిజ‌న్లు అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆమె స‌మాధానం ఇచ్చింది.

ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్‌.. `ఒకే సమయంలో ప్రేమ, విపరీతమైన ద్వేషం పొందుతున్నారు ఎలా అనిపిస్తుంది?` అని ప్ర‌శ్నించాడు. అందుకు సమంత బ‌దులిస్తూ.. `ప్రేమని కానీ, ద్వేషాన్ని కాని నేను కొనాలని అనుకోవట్లేదు. వాటికి దూరంగా సేఫ్ గా ఉండాలని అనుకుంటున్నా` అంటూ స‌మాధానం ఇచ్చింది. దీంతో స‌మంత ఎందుకు అంత మాట‌నేసింది.. ఆమెకు ప్రేమ‌పై న‌మ్మ‌కం పోయిందా.. అంటూ నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు.


Share

Related posts

Vijay Deverakonda: విజ‌య్ కోసం మ‌రో బాలీవుడ్ బ్యూటీని దింపుతున్న పూరీ?!

kavya N

సినీ లెజెండ్ మమ్ముట్టి దగ్గర ఉన్న కార్ల సంఖ్య తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

bharani jella

Liger : ఒక్క క్లైమాక్స్ లైగర్ సినిమాకి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందట..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar