Sneha: నటి స్నేహ అందరికీ సుపరిచితురాలే. 2000 సంవత్సరం టైములో అనేక సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ప్రియమైన నీకు, వెంకీ.. ఇంకా చాలా సినిమాలలో నటించడం జరిగింది. ఎక్కడ కూడా ఎక్స్ పోజింగ్ పాత్రలకు తావివ్వకుండా…సినిమాలు చేసేది. కేరియర్ మంచి పిక్స్ లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అప్పటినుండి సినిమాలకు దూరమైంది. కానీ కొద్ది సంవత్సరాలు క్రితం మళ్లీ రియంట్రీ ఇవ్వడం జరిగింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన “సన్నాఫ్ సత్యమూర్తి” సినిమాలో ఉపేంద్ర భార్యతో నటించిన.. స్నేహ పలు పాత్రలు చేస్తూ ప్రస్తుతం అలరిస్తుంది. ఇదిలా ఉంటే స్నేహ తన భర్తకి విడాకులు ఇవ్వడానికి రెడీ అయినట్లు రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. తన భర్తతో గొడవలు అయ్యి దూరంగా ఉంటుందని.. త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు బయట ప్రచారం జరుగుతుంది. వస్తున్న ఈ వార్తలపై రీసెంట్ గా స్పందించింది స్నేహ. తన భర్త ప్రసన్న కుమార్ తో దగ్గరగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వస్తున్న వార్తలకు చెక్ పెట్టింది.
అంతేకాదు ఆ పోస్ట్ కి “ట్వినింగ్” అనే క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది. దీంతో స్నేహ విడాకుల వార్తలకు పులిస్టాప్ పడింది. ప్రస్తుతం గత కొద్ది సంవత్సరాలు నుండి ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటూ వస్తున్నారు. గత ఏడాది సమంత మరియు నాగచైతన్య తీసుకున్నారు. ఆ తర్వాత ధనుష్ మరియు ఐశ్వర్య తీసుకోవడం జరిగింది. రీసెంట్ గా సానియా మీర్జా సోయోబ్ మాలిక్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే తరహాలో తనపై వార్తలు రావడంతో తన భర్తతో క్లోజ్ గా ఉన్న ఫోటో పోస్ట్ చేసి తనపై వస్తున్న వార్తలకు నటి స్నేహ చెక్ పెట్టింది.