టీవీ యాంకర్, నటి సురేఖా వాణి భర్త సురేశ్ తేజ అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. సురేశ్ తేజ పలు టీవీ షోలకు దర్శకుడిగా పనిచేశారు. ఈయన దర్శకత్వం వహించిన మా టాకీస్, మొగుడ్స్ పెళ్ళామ్స్, హార్ట్ బీట్ షోల్లో సురేఖావాణి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు.