హీరోయిన్ పూజా హెగ్డే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు చిక్కిందంటూ సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. కానీ అసలు కథేంటంటే.. నిన్న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తర్వాత పూజా హెగ్డే టీంతో కలిసి పార్టీలో పాల్గొంది. పార్టీ ముగిసిన తర్వాత ఆమె మేనేజర్స్‌తో కలిసి కారులో బయలుదేరింది. డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేస్తోన్న పోలీసులకు పూజా హెగ్డే మేనేజర్స్ డ్రింక్ చేసి ఉండటం వల్ల దొరికిపోయారు. పోలీసులు వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను స్వాధీనం చేసుకుని కారుని సీజ్ చేశారు. ఈ విషయంలో పూజా హెగ్డే తప్పేంలేదు. మీడియా వారు అక్కడకు చేరుకునే సరికి పూజాహెగ్డే మరో కారులో వెళ్లిపోయింది. అదే అసలు సంగతి. కానీ బయటకు పూజా హెగ్డే డ్రింక్ అండ్ డ్రైవ్‌లో దొరికి పోయిందనే వార్తలు వినపడ్డాయి.
previous post
next post