Subscribe for notification
Categories: సినిమా

బెల్లి డాన్స్ వెనక ఇంతుందా?

Share

హార్ట్ అటాక్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమై మొదటి సినిమాతోనే తన అందంతో కుర్రకారుకి హార్ట్ ఎటాక్ తెచ్చిన బ్యూటీ అదా శర్మ. గ్లామర్ షోకి ఎప్పుడూ వెనక్కి తగ్గని అదా, గత కొంత కాలంగా సినిమాలు లేక ఇబ్బంది పడుతుంది. సరైన ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్న అదా శర్మ, స్క్రీన్ పైన కనిపించకున్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ తన అభిమానులకి టచ్ లోనే ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలు పెడుతూ ఫ్యాన్స్ ని ఖుషి చేసే అదా శర్మ, తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
స్వతహాగా బెల్లి డాన్స్ కి కెరాఫ్ అడ్రస్ అయిన అదా శర్మ, ఇంస్టాగ్రామ్ కూడా బెల్లి డాన్స్ వీడియోనే పోస్ట్ చేసింది, ఈ వీడియోలో అదా శర్మ నడుము అందాలకి యూత్ ఫిదా అయిపోయి రిపీటెడ్ గా చూస్తున్నారు. నాజూకు నడుమును లయబద్దంగా ఊపుతూ డాన్స్ చేసిన అదా, అందరిని ఆకట్టుకోవడం వెనక ఒక పెద్ద కారణమే ఉంది. అదేంటి అంటే ఈ బెల్లి డాన్స్ ని అదా చేసింది, మందు బాబుల కోసం, మద్యం సేవిస్తే ఆరోగ్యం పాడవుతుంది, మనిషి మారిపోతాడని చెప్పడమే ఈ డాన్స్ ఉద్దేశం. అది కూడా ఫ్యాన్స్ రిక్వెస్ట్ కారణంగా అదా శర్మ ఈ డాన్స్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందుకే వీడియోలో అప్పటి దాక మందు బాటిల్ పట్టుకొని, అందంగా నడుము ఒంపులని చూపిస్తూ నృత్యం చేసిన అదా, చివరిలో ఫేస్ మారిపోయి దయ్యంలా అవుతుంది. తను చేసిన ఈ వీడియోకి, ఇచ్చిన మంచి మెసేజ్ కి అదా ఫ్యాన్స్ నుంచే కాకుండా నెటిజెన్స్ అందరి నుంచి కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ అందుకుంటుంది.

ఇదిలా ఉంటే చాలా కాలంగా సినిమాలకి దూరంగా ఉన్న అదా శర్మ, ఇప్పుడు తెలుగులో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ నటిస్తున్న కల్కి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మొదటి సినిమాతోనే మెప్పించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని అదా శర్మ భావిస్తుంది. పీరియాడికల్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన కల్కి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చూస్తుంటే అదా కోరిక నెరవేరే లాగే ఉంది.


Share
Siva Prasad

Recent Posts

Indian Film Industry: 2022 ఫస్టాఫ్ సౌత్ ఇండియా సినిమాలతో ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ..!!

Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…

12 mins ago

Balakrishna: బాల‌య్య ఈస్ బ్యాక్‌.. బ‌రిలోకి దిగేది ఎప్పుడంటే?

Balakrishna: న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వారం రోజుల క‌రోనా బారిన ప‌డ్డ విష‌యం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…

2 hours ago

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

2 hours ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

3 hours ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

4 hours ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

4 hours ago