హీరో అడవి శేష్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. కెరియర్ లో నెగిటివ్ పాత్రలతో పాటు హీరోగా నటిస్తున్న అడవి శేష్.. ఇటీవల మేజర్ సినిమాతో దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకున్నాడు. తన కెరియర్ లోనే మర్చిపోలేని సినిమా అని అడవి శేష్.. “మేజర్” విజయం పట్ల ప్రశంసల వర్షం కురిపించడం తెలిసిందే. అయితే ఈ సినిమా రాకముందు “గూడచారి” సినిమాతో కూడా బాగా ఆకట్టుకున్నాడు. 2018వ సంవత్సరంలో శశికిరణ్ తిక్క దర్శకత్వంలో వచ్చిన “గూడచారి” భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
దీంతో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో సీక్వెల్ చేయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారు. ఇదే టైటిల్ తో రెండో భాగం తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు అంట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది అని సమాచారం. ప్రస్తుతం “హిట్ 2” తో మరికొద్ది రోజుల్లో అడవి శేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్. ఏది ఏమైనా కెరియర్ పరంగా అడవి శేష్ ఒక ప్లానింగ్ తో… సినిమాలు ఒప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.
“గూడచారి”, “మేజర్” రెండు కూడా అడవి శేష్ కెరియర్ లో భారీ విజయాలు సాధించిన సినిమాలు కావడంతో రాబోయే “గూడచారి 2” పై అడవి శేష్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది. క్షణం, గూడచారి, మేజర్ ఈ మూడు కూడా ఒక డిఫరెంట్ జోనర్ సినిమాలు. దీంతో అడవి శేష్ ఒప్పుకుంటున్న సినిమాలు బట్టి చూస్తే… వైవిధ్యమైన ఫార్ములాలతో.. కెరియర్ ముందుకు సాగిస్తున్నట్లు అర్థమవుతుంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!