యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం `కె.జి.యఫ్`. ఇందులో తొలిభాగం `కె.జి.యఫ్ చాప్టర్ 1` గత ఏడాదిన కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై రూ.200కోట్లను రాబట్టింది. కన్నడ సినిమా మార్కెట్ ఓ రేంజ్లో పెరిగిపోయింది. యష్ నటన, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఇప్పుడు `కె.జి.యఫ్ చాప్టర్ 2`పై అందరి ఆసక్తిని కనపరుస్తున్నారు. నిర్మాతలు మరింత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం విశేషం.
పార్ట్ వన్‌లో చాలా మంది విలన్స్ ఉంటారు. అందులో మెయిన్ విలన్ సోదరుడుగా నటించిన అధీర అనే పాత్రను పాక్షికంగానే చూపించారు. అసలు అధీర ఎవరో ప్రేక్షకుడికి తెలియకుండానే పోయింది. సినిమా హిట్ కావడంతో మేకర్స దాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్‌ను నటింప చేశారని అంటున్నారు. ఆ నటుడెవరో కాదు.. సంజయ్ దత్. ఈ పాత్రకున్న ప్రాముఖ్యతను అనుసరించి సంజయ్‌దత్‌ను సంప్రదిస్తే ఆయనకు కూడా ఓకే చెప్పి నటిస్తున్నారు. ఆయన నటిస్తోన్న రెండో దక్షిణాది చిత్రమిది. కన్నడలో సంజూ బాబా నటిస్తోన్న తొలి చిత్రమిదే. ఆయన పుట్టినరోజు జూలై 29. ఈ సందర్భంగా.. ఆయన ఆయన లుక్‌ను విడుదల చేస్తారంటున్నారు. కానీ అధీరపాత్రలో సంజూ బాబా నటిస్తున్నాడని మేకర్స్ రివీల్ చేయలేదు మరి.