Abhi: ఒకప్పుడు తెలుగు టెలివిజన్ కామెడీ షోలలో నంబర్ వన్ స్థానంలో జబర్దస్త్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మొత్తం తారు మారయ్యాయి. జబర్దస్త్ షో నుండి చాలామంది టాప్ మోస్ట్ కమెడియన్ లు బయటకు వచ్చేయడం జరిగింది. మొదట మెగా బ్రదర్ నాగబాబు తర్వాత చమ్మక్ చంద్ర, ఆర్పి మరి కొంతమంది. అనంతరం రోజా ఇంకా యాంకర్ లుగా ఉన్న రష్మీ మరియు అనసూయ కూడా జబర్దస్త్ ఇప్పుడు ఆ షో రేటింగ్ చాలా మట్టానికి పడిపోయాయి.

ఇదే సమయంలో షో నుండి బయటకు వచ్చిన కొంతమంది యాజమాన్యంపై తోటి కంటెస్టెంట్లపై విమర్శలు కూడా చేయడం జరిగింది. ఈ క్రమంలో ఒకప్పుడు ఇదే జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించిన అదిరే అభి… ఈ షో గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్టులో ఏముంది అంటే…”మా జబర్దస్త్ కి దిష్టి తగిలింది…ఆ చరుచుకుంటూ నవ్వే జడ్జీలు,టైమింగ్ తో పంచులేసే టీం లీడర్లు, కామెడిని అవపోసన పట్టిన కంటెస్టెంట్లు, అన్నంపెట్టె అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు, సమయం ఆగేది కాదు. కుశల ప్రశ్నలు, ఆపన్నహస్తలు, జోకుల మీద జోకులు, స్టూడియో దాటే నవ్వులు. బాబు గారి హుందాతనం, రోజా గారి చిలిపితనం, అనసూయ రష్మిల అందం, స్కిట్ల మాయాజాలం.

స్టేజి ఎక్కేవరకు రిహార్సల్లు, అయినా అప్పుడప్పుడు స్పాన్టేనిటీలు పోస్టర్ అఫ్ ది డే కోసం పోజులు. పాతికవేల చెక్కుతో ఫోటోలు. జడ్జీల వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు. ఎవరి దిష్టి తగిలిందో, ఏక తాటి మీద నడిచిన మాకు ఎవరి దారి వారిదయ్యింది. ఎవడైనా పల్లెత్తి మాటంటే పడని మేము, మమ్మల్ని మేమె మాటలు అనుకుంటున్నాం. సమయం వెనక్కెళ్ళితే బాగుండు. ఆ రోజులు తిరిగి వస్తే బాగుండు. అందర్నీ నవ్వించే జబర్దస్తికి, మళ్ళి నవ్వేరోజులు వస్తే బాగుండు”…అంటూ అదిరే అభి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది.