Adi Purush: భారతీయ చలనచిత్రా రంగంలో ₹1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా “KGF 2” రికార్డు క్రియేట్ చేయడం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యాష్ యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించారు. హీరోయిజం ఎలివేషన్ తో.. స్టోరీని నడిపిస్తూ మాస్ ప్రేక్షకులను కేజిఎఫ్ సెకండ్ పార్ట్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 14వ తారీకు విడుదలైన ఈ సినిమా అనేక రికార్డులు క్రియేట్ చేసింది. ₹1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా ఇండియాలో నాలుగో స్థానంలో నిలిచింది.
ఇదంతా పక్కన పెడితే కాజాగా ప్రభాస్ కొత్త సినిమా “ఆది పురుష్” విడుదల అవ్వకముందే “KGF 2” రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12వ తారీకు విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అక్టోబర్ రెండవ తారీకు ఉత్తర ప్రదేశ్ లో అయోధ్య నగరంలో టీజర్ విడుదల చేయడం జరిగింది.
“KGF 2″ టీజర్ అన్ని భాషలలో కలిపి 24 గంటల్లో 68.83 మిలియన్ ల వ్యూస్ సాధించగా…”ఆది పురుష్” కేవలం 17 గంటల్లోనే 88 మిలియన్ ల వ్యూస్ సాధించటం జరిగింది. ఇదే సమయంలో 932K లైక్స్ వచ్చాయి. కమల్ హాసన్ విక్రం వేద టీజర్ 93K లైక్స్ తో రెండో స్థానంలో నిలిచింది. “ఆది పురుష్” లో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించడంతో.. బాలీవుడ్ మొదలుకొని సౌత్ వరకు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా ఈ మూవీలో కృతి సనన్ సీత పాత్రలో కనిపిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రలో కనిపిస్తున్నాడు.