Prabhas -Adipurush: ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఇంతటి క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ప్రభాస్ రామాయణం కథాంశంగా తెరకెక్కుతున్న “ఆదిపురుష్”చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
పాన్ ఇండియా తరహాలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో మనకు కనిపించనున్నారు.అయితే ఈ శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం నుంచి రాముని పాత్రకు సంబంధించినటువంటి లుక్ విడుదల చేస్తామని ఇదివరకే మేకర్స్ ప్రకటించారు.అయితే పండుగ రోజు తమ అభిమాన హీరో కొత్త సినిమాలోని ఫస్ట్ లుక్ విడుదల కాబోతుందని తెలియడంతో అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని మరి ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే చిత్రబృందం వారి ఆశలను అడియాశలు చేసింది. సాయంత్రం వరకు అయిన ఈ సినిమా లుక్ విడుదల చేస్తారని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది.
ప్రభాస్ ఆదిపురుష్:
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా పండుగ రోజు మాత్రం ఆ లుక్ విడుదల కాలేదు. ఈ విధంగా ప్రభాస్ లుక్ విడుదల చేయక పోవడానికి పలు కారణాలను చెబుతున్నారు. ప్రభాస్ లుక్ అంతగా ఆకట్టుకునే విధంగా లేదని, ఈ లుక్ చూసిన కృష్ణంరాజు కుటుంబ సభ్యులు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయొద్దని చెప్పినట్లు తెలుస్తోంది.అదే విధంగా ప్రస్తుతం కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పోస్టర్ కొద్దిరోజుల పాటు వాయిదా వేయడం మంచిదని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ సందడి చేయగా, సీతగా కృతి సనన్,లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక రావణాసుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. అదేవిధంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు దశరథుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!