NewsOrbit
సినిమా

Adivi Sesh: గుట్టు విప్పేసిన అడవి శేష్.. వాళ్ళవలనే పైకి వచ్చాను!

Share

Adivi Sesh: అడవి శేష్ గురించి ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాలి. తెలుగు సినిమా పరిశ్రమలో ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వచ్చి హీరోగా ఎదిగినవారిలో అడివి శేషు ఒకరు అని చెప్పుకోవాలి. అయితే మొదట శేషు తననితాను ఓ దర్శకుడిగా, నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసుకున్నాడు. అడవి శేష్ డైరెక్ట్ చేస్తూ నటించిన మొదటి సినిమా ‘కర్మ’ గురించి అతి కొద్దిమందికి తెలుసు. అది అప్పుడప్పుడే సినిమా పరిశ్రమ విస్తరిస్తున్న కాలం. మొత్తం కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న వేళ, ‘కర్మ’ అనే ఓ ఆర్ట్ ఫిలిం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు శేషు. సినిమా అంతగా ఆడలేకపోయినా, ఓ నటుడిగా.. దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు.

Adivi Sesh Reveals Secret
Adivi Sesh Reveals Secret

పవన్ కళ్యాణ్ ప్రశంసలు:

అప్పుడప్పుడే సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో కీలక రోల్ కొట్టేసాడు శేష్. దాంతో శేష్ దశ దిశ తిరిగిపోయాయనే చెప్పుకోవాలి. ఇక ఆ తరువాత శేష్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తరువాతి కాలంలో ‘క్షణం’ .. ‘గూఢచారి’ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పంజా సినిమా చేస్తున్న సమయంలో శేష్ మొదటి సినిమా ‘కర్మ’ విషయంలో పవన్ కళ్యాణ్ శేష్ ని మెచ్చుకున్నారట. మంచి భవిష్యత్ ఉందని కితాబిచ్చాడట. అనుకున్నట్టుగానే అనతికాలంలోనే శేష్ మంచి పేరు సంపాదించుకున్నాడు.

Adivi Sesh Reveals Secret
Adivi Sesh Reveals Secret

వాళ్ళవలనే పైకి వచ్చాడట!

ఇకపోతే శేష్ తాజా చిత్రంగా రూపొందిన ‘మేజర్’ సినిమా జూన్ 3వ తేదీన విడుదల నేపథ్యంలో ఆయన ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో పాల్గొని పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ‘క్షణం’ సినిమా సమయంలో సినిమా సూపర్ అని ‘అల్లు అర్జున్’ స్వయంగా భుజం తట్టాడట. అలాగే ‘పంజా’ సినిమాలో కో డైరెక్టర్ వచ్చి .. ‘కొంచెం ఎక్కువగా చేస్తున్నావ్.. హీరో కంటే ఎక్కువైపోతోంది చూస్కో’ అని చెప్పినప్పుడు పవన్ కల్యాణ్ గారు అడ్డుపడి, తాను ఎలా చేయాలనుకుంటున్నాడో అలా చేయని అని ఆ కో డైరెక్టర్ చెప్పి, శేష్ ని ఎంకరేజ్ చేశారట. అలాగే మా ఫ్యామిలీ పెద్ద అడివి బాపిరాజుగారి రచనలను గురించి పవన్ సార్ నాతో చర్చించేవారని చెప్పుకొచ్చాడు. ఇలా మెగా ఫ్యామిలీలో ఇద్దరు ఎంతగానో నన్ను సపోర్ట్ చేసారని చెప్పుకొచ్చాడట.


Share

Related posts

ప్ర‌భాస్ కోసం స్పెష‌ల్ సెట్‌

Siva Prasad

ఆ హీరోతో ఒక్క‌సారైనా న‌టించాలి.. అనుప‌మ కోరిక తీరేనా?

kavya N

Prashanth neel : కన్నడ దర్శకుడికి టాలీవుడ్ లో రాజమౌళిని మించే పాపులారిటీ పెరుగుతోందా..?

GRK