24.2 C
Hyderabad
February 5, 2023
NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Hit 2 Adivi Sesh Exclusive Interview: G2, ఇష్టమైన నటి, మలయాళం సినిమాలు, ఆస్కార్ రీమేక్, సుశాంత్ సింగ్, ఎన్నో కొత్త విషయాలు బయటపెట్టిన అడివి శేష్

Hit 2 Adivi Sesh Exclusive Interview
Share

 

Hit 2 Adivi Sesh Exclusive Interview: కర్మ సినిమా తో తెలుగు ప్రజలకి హీరో లా పరిచయమైనా, 2011 లో పవన్ కల్యాణ్ పంజా సినిమా విలన్ పాత్రలో ఆకట్టుకున్నా, మేజర్ సినిమా లో సందీప్ ఉన్ని కృష్ణన్ గా ఇన్స్పైర్ చేసినా, తాజాగా హిట్ 3 తో దేశం లోనే సంచలన నటుడిగా పేరు తెచ్చుకున్నా- అడివి శేష్ ది ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం. హైదరాబాద్ లో పుట్టి అమెరికా లో పెరిగిన అడివి శేష్ ఒక మృదు స్వభావి, పూర్తి శాకాహారి, మద్యం మాంసం అలవాటు లేని మిల్క్ బాయ్.

హిట్ 2 సక్సెస్ తరువాత బాగా బిజీ అయిపోయిన అడివి శేష్ ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎన్నో కొత్త విషయాలు బయట పెట్టాడు.

G2: గూఢచారి 2 గురించి 

హిట్ 2 సక్సెస్ తరువాత అడివి శేష్ ను చాలా మంది అడుగుతున్న ప్రశ్న G2 గూఢచారి 2 మూవీ ఎంతవరకు వొచ్చింది, రిలీజ్ డేట్ ఎప్పుడు అని. ఈ విషయం గురించి ఎక్కువ విషయాలు బయటపెట్టలేదు కానీ G2 గూఢచారి 2 హిట్ 2 కంటే భారీ గా మాత్రం ఉంటుంది, దాని కోసం ఎంత కష్టపడటానికైనా సిద్ధం అని మాత్రం ధీమా వ్యక్తం చేసాడు.

కుక్కలంటే ప్రీతి

అడివి శేష్ కి కుక్కలంటే చాలా ఇష్టం అట, హిట్ 2 లో కూడా కథలో ఒక కుక్క చాలా ముఖ్య పాత్ర పోషించింది. దీని గురించి మాట్లాడుతూ… నాకు కుక్కలంటే చాలా ఇష్టం. నా కుక్క పేరు బబ్స్, దానిని చూడగానే నాకు చాలా బబ్లీ గా అనిపించింది అందుకే బబ్స్ అని పేరు పెట్టుకున్నా అంటూ మురిసిపోయాడు.

నెక్ట్స్ ఏంటి

రాబోయే సినిమాలు గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికి ఒక ఆస్కార్ నామినేటెడ్ హాలీవుడ్ సినిమా రీమేక్ మీద పని చేస్తున్నట్లు త్వరలోనే ఆ సినిమాకి సంబందించిన అప్డేట్ ఇస్తాను అని అక్కడితో ఆపేసాడు, ఆ సినిమా రొమాంటిక్ మూవీ అని చెప్పి పేరు మాత్రం చెప్పలేదు.

ఇష్టమైన దర్శకుడు 

ఇంకెవరు రాజమౌళి గారు, ఆయనతో బాహుబలి సినిమా లో పనిచేయడం నాకు సినిమా పట్ల జీవితం పట్ల చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. అసలు సినిమాకి ఎంత కమిటెడ్ గా ఉండాలో రాజమౌళి గారి దెగ్గరే నేర్చుకున్నా, అందుకు బాహుబలి తరువాత నా సినిమాలు చూస్తే మీకు ఆ వ్యత్యాసం కనిపిస్తుంది. డైరెక్టర్ నందిని అంటే కూడా నాకు చాలా ఇష్టం, నాతో తాను ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నా…

ఇష్టమైన నటి 

సామ్… సమంత దెగ్గర కూడా నేను చూసింది అదే. సినిమాకి కమిట్ అయి ఉండడం కష్టం అయినా సరే వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లడం… అందుకే నాకు సమంత అంటే ఇష్టం.

క్షణం సినిమా గురించి మాట్లాడుతూ… 

క్షణం సినిమా నేను రాసుకున్నది, అది నాలో ఉన్న ఆవేశం నుంచి వొచ్చిన  సినిమా, నన్ను నేను నిరూపించుకోవాలి అనే తపన తో తీసిన సినిమా

హిట్ 2 సక్సెస్ గురించి 

హిట్ 2 ఇప్పుడు నా లైఫ్ ని మార్చేసింది. నేను St. స్టీఫెన్స్ కాలేజ్ కి ఇంతకముందు ఒక 5 సార్లు వెళ్లి ఉంటాను. అప్పుడు నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు… హిట్ 2 తర్వాత అక్కడికి వెళ్తే నెత్తి మీద పెట్టుకుని తీసుకువెళ్లారు. మొన్న లయోలా కాలేజీ కి వెళ్తే ఐదు వేలకు పైన స్టూడెంట్స్ కేడీ కేడి అంటూ పిచ్చి గా అరిచారు… ఆ ఆనందమే వేరు మాటల్లో చెప్పలేను

నేను మొదటి సారి మందు తాగింది కూడా హిట్ 2 సక్సెస్ తరువాతే… నాని తన దెగ్గర ఆఫీస్ లో ఉన్న షాంపైన్ గ్లాస్ లో పోసి తాగమని బలవంతం చేస్తే తాగాను…కానీ ఆ చేదు అస్సలు నచ్చలేదు.

Adivi Sesh with Naani
Adivi Sesh with Naani: నేను మొదటి సారి మందు తాగింది కూడా హిట్ 2 సక్సెస్ తరువాతే


హిట్ 3 లో మీ పాత్ర 

హిట్ 3 లో నేను కచ్చితంగా ఉంటాను, అయితే అది 1 నిమిషం పాత్ర ఉంటుందో లేదా 1 గంట సేపు ఉంటానో ఇంకా క్లారిటీ లేదు. శైలేశ్ కొల‌ను కథ చెప్పేదాకా వేచి ఉండాలి ఆ తరువాత నిర్ణయం తీసుకుంటా.

మహేష్ లాంటి స్టార్ హీరో గెస్ట్ రోల్ పెట్టొచ్చు కదా 

ఆడియన్స్ ఎన్ని కష్టాలు ఉన్న వాటిని పక్కన పెట్టి మా కోసం సినిమాకి వొస్తారు, ఎదురు డబ్బులు ఇచ్చి మరి వొస్తారు మేము ఏం చెప్తున్నామో చూడటానికి. వారికి తగినట్టు సినిమా తీయడం మా బాధ్యత, కానీ సినిమా ఒక కళ, అది తీసే వారికే ఎలా ఉంటుందో నిర్ణయించే హక్కు. సో ఇలాంటి ప్రశ్నలు దర్శకుడికే వొదిలెద్దాం.

సీతా రామం గురించి 

స్వప్న(నిర్మాత) నాకు మంచి ఫ్రెండ్. సీతా రామం సినిమాలో నన్ను పెట్టుకోలేదు అని నాకు కొంచెం బాధ ఉన్నా  దుల్కర్ సల్మాన్ ఆ సినిమాకి పూర్తి న్యాయం చేసాడు, సో ఇట్స్ ఒకే.

మీ సినిమాల్లో పాటలు బాగుంటాయి 

అమెరికా లో పెరగడం వలన మొదట్లో అసలు సినిమాల్లో పాటలు అవసరం లేదు అనుకునే వాణ్ని, అందుకే నా స్టార్టింగ్ సినిమాల్లో పాటలు ఎక్కువ ఉండేవి కాదు. కానీ నార్త్ లో ఒకసారి ఒక డీజే ని కలిసాను, అతను నాకు పెద్ద ఫాన్ అంట కానీ నా సినిమా పాటలు ప్లే చేద్దాం అంటే అసలు ఏమి లేవు అని ఆవేదన వ్యక్తం చేసాడు.. అందుకే తరువాత నుండి పాటల మీద కూడా దృష్టి పెట్టడం మొదలు పెట్టాను.

Adivi Sesh Exclusive Interview First Time After Hit 2 Success
Adivi Sesh Exclusive Interview First Time After Hit 2 Success


మలయాళం సినిమాలు 

బలే తీస్తారు వాళ్ళు సినిమాలు. నాకు బాగా నచ్చినవి కుంబళంగి నైట్స్, భీష్మ పర్వం. కమర్షియల్ సినిమా అంటే ఇలా ఉండాలి అనేట్టు ఉంటుంది భీష్మ పర్వం. అయ్యప్పనుమ్ కోషియం బాగుంటుంది కానీ నాకు దానికంటే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఎక్కువ నచ్చింది.

నచ్చిన నటుడు 

చెప్పడం కష్టమే…హిందీలో సుశాంత్ సింగ్ అంటే చాలా ఇష్టం. కై పో చే లో చాలా బాగా నటించాడు.

ఇన్‌స్టాగ్రామ్ లో అడిక్టెడ్ టు మీమ్స్ అనే ఛానల్ రవి తో మాట్లాడుతూ అడివి శేష్ సరదాగా ఇలాంటి విషయాలు పంచుకున్నాడు. ఆ ఛానల్ మీమ్స్ అంటే శేష్ కి చాలా ఇష్టం అట, రాహుల్ రామకృష్ణ తను ఎక్కువగా ఈ ఛానల్ మీమ్స్ షేర్ చేసుకుని నవ్వుకుంటారట.

Adivi Sesh Exclusive Interview First Time After Hit 2 Success Screen grab
Adivi Sesh Exclusive Interview First Time After Hit 2 Success Screen grab

 

 


Share

Related posts

Varun tej: మెగా హీరో కోసం దిగిన మిల్కీ బ్యూటీ..ఆ మ్యాజిక్ రిపీట్ గ్యారెంటీ..

GRK

Pawan Kalyan: మరోసారి పూరీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్..??

sekhar

Krithi Shetty: అలాంటి పాత్ర చేయాల‌నుంది..కోరిక బ‌య‌ట‌పెట్టిన‌ కృతి శెట్టి!

kavya N