Surya Jyothika: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్ ల జంట లలో ఒక పెయిర్ సూర్య జ్యోతిక. ఇద్దరి జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. వీరిద్దరు కలిసి పెళ్లికాకముందు సినిమాలు చేయడం తెలిసిందే. పెళ్లి తర్వాత జ్యోతిక సినిమాలు చేయడం ఆపేసింది. అయితే గత ఏడాది ఓ వెబ్ సిరీస్ జ్యోతిక చేయడం తెలిసిందే. కాగా ఇప్పుడు మరో సారి జ్యోతిక నటించడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
అది కూడా భర్త సూర్య తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి. డైరెక్టర్ బాల దర్శకత్వంలో సూర్య హీరోగా డ్యూయల్ రోల్ పాత్ర చేయనున్నారట. ఒకటి మూగ మరొకటి చెవిటి పాత్ర అని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్రలో జ్యోతిక నీ దర్శకుడు బాల సెలక్ట్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. ప్రధాన హీరోయిన్ గా కృతి శెట్టి కనిపించనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి. టూడి వెంకట్ పతాకంపై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్ నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం.
గతంలో బాల దర్శకత్వంలో నంద, పితామగన్ సినిమాలు చేసి బ్లాక్ విజయాలు సాధించి సూర్య తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. ఈ సినిమాని అని దక్షిణాదిలో ప్రధాన భాషలలో తెరకెక్కించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమా చాలా త్వరగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నట్లు తమిళ సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కరోనా వైరస్ కారణంగా గతంలో దాదాపు రెండున్నర సంవత్సరాలు షూటింగ్ లకి అంతరాయం కలుగుతూనే ఉన్న క్రమంలో.. ఈ సినిమాని చాలా త్వరగా కంప్లీట్ చేయాలని సూర్య మరియు డైరెక్టర్ బాల ముందుగానే డిసైడ్ అయినట్లు పక్కా షెడ్యూల్ తో ఏప్రిల్ నుండి సినిమా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!