Anil Ravipudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న కుర్ర డైరెక్టర్లలో ఒకరు అనిల్ రావిపూడి. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా అనిల్ రావిపూడి తనదైన శైలిలో సినిమాలు చేస్తూ ఇప్పటివరకు ఒక్క పరాజయం కూడా చూడకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం “F3” సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా ఈ నెల 27వ తారీకు విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. అంతకుముందు వచ్చిన “F2” సూపర్ డూపర్ హిట్ అయింది. వరుణ్….వెంకటేష్ కామెడీ పరంగా ఇరగదీశారు. అంతకుమించి “F3” ఉంటుందని.. తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమయంలో నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుల గురించి కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు. నటసింహం నందమూరి బాలయ్య బాబుతో సినిమా చేస్తున్నట్లు అది సెప్టెంబర్ మాసం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిపారు. ఇక ఇదే సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయటానికి రెడీ అవుతున్నట్లు ఆల్రెడీ… స్క్రిప్ట్ కూడా వినిపించినట్లు త్వరలో ఫైనలైజ్ అవుతుందని.. చర్చల దశలో ఉందని స్పష్టం చేశారు. దీంతో బ్యాక్ టు బ్యాక్ నందమూరి హీరోలతో అనిల్ రావిపూడి సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బాలయ్య బాబు.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. మరో పక్క ఎన్టీఆర్ తన కెరియర్ లో 30వ సినిమా కొరటాలతో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నెలాఖరు నుండి స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అనిల్ రావిపూడి ప్రాజెక్టులు నందమయా హీరోలతో చూసుకుంటే.. గోపీచంద్ మలినేని తర్వాత.. బాలకృష్ణ తో అనిల్ రావిపూడి చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి కొరటాల తర్వాత ఎన్టీఆర్.. అనిల్ రావిపూడి తో చేస్తారో లేదో స్క్రిప్ట్ ఓకే బట్టి తెలుస్తోంది.