NewsOrbit
Entertainment News సినిమా

Niharika: విడాకులు తీసుకున్న తర్వాత నిహారిక సోషల్ మీడియాలో సంచలన పోస్ట్..!!

Advertisements
Share

Niharika: మెగా డాటర్ కొణిదెల నిహారిక ఆమె భర్త జొన్నలగడ్డకు కుక్కట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయడం జరిగింది. దీంతో ఈ వార్త ఎలక్ట్రానిక్ మరియు వెబ్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. పరిస్థితి ఇలా ఉంటే విడాకులు మంజూరు చేయటంతో నిహారిక ఇంస్టాగ్రామ్ లో సంచలన పోస్ట్ పెట్టింది. పరస్పర అంగీకారంతోనే తాను మరియు చైతన్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు నిహారిక ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇది చాలా సున్నితమైన సమయం అని తమను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నట్లు విజ్ఞప్తి చేసింది.

Advertisements

After getting divorced, Niharika made a sensational post on social media

ఇదే సమయంలో తనకు మద్దతుగా నిలిచిన కుటుంబానికి మరియు స్నేహితులకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొంది. తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొంత ప్రైవసీ కోరుకుంటున్నట్లు నిహారిక స్పష్టం చేయడం జరిగింది. నిహారిక పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2020లో వీరి వివాహం జరిగింది. ఆ సమయంలో కరోనా రావటంతో రాజస్థాన్ నందు జైపూర్ లో భారీ ఎత్తున కుటుంబ సభ్యుల మధ్య వేడుక నిర్వహించారు. మెగా హీరోలు ఇంకా చాలామంది ఈ వేడుకకు హాజరయ్యి.. పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. అయితే పెళ్లయిన రెండు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య గొడవలు రావడం జరిగింది. గత ఏడాదిలోనే వీరిద్దరు విడిపోయినట్లు ఎవరికి వారు ఉంటున్నట్లు మీడియాలో భారీ ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా ఒకరి ఫోటోలు మరొకరు అకౌంట్లో డిలీట్ చేసుకోవడంతో పాటు అన్ ఫాలో చేసుకున్నారు.

Advertisements

After getting divorced, Niharika made a sensational post on social media

ఇటీవల నిహారిక అన్నయ్య వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకలో అదేవిధంగా చిరంజీవి మనవరాల వేడుకలు ఎక్కడ కూడా చైతన్య కనిపించలేదు. అన్ని కార్యక్రమాలలో నిహారిక ఒక్కతే కనిపించింది. అందరు అప్పుడే డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేయటం జరిగింది. ఏది ఏమైనా పెళ్లయిన రెండు సంవత్సరాలకే నిహారిక విడాకులు తీసుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మెగా కుటుంబంలో చాలామందికి పెళ్లి కలిసి రావడం లేదని తాజా పరిణామాలపై కామెంట్లు చేస్తున్నారు.

 

 


Share
Advertisements

Related posts

Puri jagannath: ఇండస్ట్రీలో హీరోల గురించి పూరి భార్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

sekhar

Intinti Gruhalakshmi 24 August: తులసిలో అష్ట దేవతలను వర్ణించిన సామ్రాట్..!

bharani jella

Batuku Bustand:  బతుకు బస్టాండ్ “బుస్సా బుస్సా” సాంగ్ కు అదిరిపోయే రెస్పాన్స్..!!

bharani jella