KGF 2: “కేజిఎఫ్” తో హీరో యాష్ భారీ క్రేజ్ సంపాదించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రాకముందు వరకు కన్నడ ప్రేక్షకులకు తప్ప యాష్ అంటే ఎవరికి తెలియదు. “కేజిఎఫ్” ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన సమయంలో అంచనాలు లేవు. అటువంటిది “కేజిఎఫ్”.. భారీ హిట్ కావటంతో ఈ సినిమాతో ఓవర్ నైట్ లో తిరుగులేని హీరోగా యాష్ పేరు సంపాదించు కోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు “కేజిఎఫ్” కి సీక్వెల్ గా “కేజిఎఫ్ 2” రావడం తెలిసిందే. ఏప్రిల్ 14 వ తారీకు “కేజిఎఫ్ 2” ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి చాప్టర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో “కేజిఎఫ్ 2” చాప్టర్ పై భారీ అంచనాలు ఆడియన్స్ పెట్టుకున్నారు. అయితే ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు ఏమాత్రం తగ్గిపోకుండా సినిమాని అద్భుతంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రీకరించటం జరిగింది. సినిమా టేకింగ్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్… యాక్షన్ సీన్స్ కి థియేటర్ లలో జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని బ్యాలెన్సింగ్ చేస్తూ.. ప్రశాంత్ నీల్ తన డైరెక్షన్ పవర్ ఏంటో చూపించి.. మరోసారి తన సత్తా చాటాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా “కేజిఎఫ్ 2” బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.“కేజిఎఫ్” రిలీజ్ అయిన సమయంలో యాష్ పెద్దగా తెలియదు ఎప్పుడైతే.. “కేజిఎఫ్” అనువాద హక్కులు 5 కోట్లకు కొర్రపాటి సాయి తీసుకుని.. ప్రమోషన్ చేయగా.. సినిమా విడుదలయ్యి 12 కోట్ల రూపాయలు భారీ లాభాలను తీసుకురావడం జరిగింది. “కేజిఎఫ్” సూపర్ హిట్ తో “కేజిఎఫ్ 2” కి భారీ క్రేజ్ ఏర్పడింది అనువాద హక్కులు ఏకంగా 80 కోట్లకు పలికినట్లు వార్తలు వస్తున్నాయి. ఈల కబడ్డీ తెలుగులో అనువాద చిత్రానికి సంబంధించి ఎక్కువ ధర పలికిన సినిమా మొదట రజనీకాంత్ నటించిన రోబో 2.0 కాగా ఇప్పుడు యాష్ సినిమాకి ఆ స్థాయిలో ధర పలికిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. “కేజిఎఫ్ 2” క్రేజ్ ఒక్క తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏకంగా ఆర్ఆర్ఆర్ నీ కూడా మించి పోయినట్లు అడ్వాన్స్ బుకింగ్ ఆ రీతిలో… జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!