RRR: “RRR” తర్వాత స్టోరీల విషయంలో ఎన్టీఆర్ సంచలన మార్పు..!!

Share

RRR: బాహుబలి(Bahubali) పుణ్యమా తెలుగు సినిమా స్థాయి తో పాటు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ కి మంచి పేరు ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. ఒకానొక టైంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గుర్తొచ్చేది కేవలం బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీ.. అన్న తరహాలో పరిస్థితి ఉండేది. కానీ జక్కన్న ఎప్పుడైతే బాహుబలి తెరకెక్కించడం జరిగిందో… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ పై ఉన్న దృష్టి సరికొత్తగా ఏర్పడింది. ఇటువంటి తరుణంలో చాలావరకూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఇండస్ట్రీల్లో కు చెందిన హీరోలు పాన్ ఇండియా నేపథ్యం కలిగిన సినిమాలను చేస్తూ ఉన్నారు.

NTR Jr Talks 'RRR' Experience With S.S. Rajamouli - Variety

తెలుగు, హిందీ హీరోలు అనే తేడా లేకుండా ఎవరికి వారు పాన్ ఇండియా కథలు ఎంచుకుంటున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం చాలావరకు టాలీవుడ్(Tollywood) కే పరిమితం అయ్యేలా రాణించడం జరిగింది. కొద్దో గొప్పో కన్నడంలో మినహా ఇంకా మరే ఇండస్ట్రీలో ఎన్టీఆర్(NTR) కి పెద్దగా క్రేజ్ లేదు అని చాలామంది అంటారు. కానీ టాలెంట్ పరంగా చూసుకుంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చాలామంది మహామహులు చెబుతుంటారు. తారక్ తో పోటి పడి నటించడానికి మహామహులే భయపడుతున్నారని.. కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించే వాళ్ళు చెబుతుంటారు.

RRR makers unveil Jr. NTR's first look as Bheem, Ram Charan and fans can't  keep calm | VIDEO | Regional-cinema News – India TV

నటన పరంగా ఎవరెస్టు లాంటి టాలెంట్ ఉన్నాగాని క్రేజ్ కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ కే పరిమితం కావడంతో ఎన్టీఆర్ ఇక నుండి.. పాన్ ఇండియా నేపథ్యం కలిగిన సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయారు అంట. దీంతో RRR తర్వాత మొత్తం సబ్జెక్టులు అన్ని పాన్ ఇండియా స్టోరీలను డీల్ చేసే దర్శకులకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారట. ప్రస్తుతం చేస్తున్న కొరటాల శివ(Koratala Shiva) ఆ తర్వాత అట్లీ, “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) లాంటి వారికి ఎన్టీఆర్ అవకాశాలు ఇవ్వటానికి గల కారణం పాన్ ఇండియా మార్కెట్ లో రాణించడమే ని ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.


Share

Related posts

అల్లు అర్జున్ నే కాదు దిల్ రాజు ని తక్కువంచనా వేశారు.. అలాంటి వాళ్ళందరికి ఇదే సమాధానం..!

GRK

Nani: రాజకీయరంగంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాని కామెంట్స్..!!

sekhar

ఆచార్యలో ‘రామ్ చరణ్’కి ‘హీరోయిన్’గా ఆ అందాల భామ ఫిక్స్..!

Teja