సినిమా

SVP: “సర్కారు వారి పాట” తర్వాత డైరెక్టర్ పరశురామ్ ఆ హీరోతో..ప్రాజెక్ట్..??

Share

SVP: కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న సినిమాతో రొమాంటిక్ వాతావరణం క్రియేట్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టడం లో సిద్ధహస్తుడు డైరెక్టర్ పరుశురాం. మనోడు దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలలో ‘గీత గోవిందం” తిరుగులేని విజయాన్ని సాధించింది. అప్పటికే “అర్జున్ రెడ్డి”తో యూత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండకి.. “గీతా గోవిందం”తో అమ్మాయిలలో మంచి క్రేజ్ క్రియేట్ చేయడం జరిగింది. అటువంటి దర్శకుడు ఇప్పుడు మహేష్ బాబుతో “సర్కారు వారి పాట” అనే సినిమా చేయటం ఇండస్ట్రీలోనే సరికొత్త ఫ్లేవర్ గా ఈ ప్రాజెక్టు గురించి మొదటి నుండి డిస్కషన్స్ జరుగుతున్నాయి.

AFTER SVP PARUSURAM DIRECTING NAGACHAITHANYA

పైగా మహేష్ మేకోవర్ పూర్తిగా చాలా కొత్తగా ఉండటంతో.. పాటు “పోకిరి” తరహా విజయం “సర్కారు వారి పాట” సాధిస్తుందని… స్వయంగా మహేష్ చెప్పటంతో అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్.. పోస్టర్ లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మే 12వ తారీకు వేసవి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. మే రెండో తారీకు “సర్కారు వారి పాట” ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా మొత్తం కంప్లీట్ అయింది ప్రస్తుతం మోషన్ కార్యక్రమాలకు సినిమా యూనిట్ రెడీగా ఉంది. ఇదిలా ఉంటే “సర్కారు వారి పాట” తర్వాత డైరెక్టర్ పరుశురాం… అక్కినేని నాగచైతన్య తో సినిమా చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతోంది.

AFTER SVP PARUSURAM DIRECTING NAGACHAITHANYA

ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించినట్లు.. చైతు కూడా ఓకే చెప్పినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య… విక్రమ్ కుమార్ దర్శకత్వంలో “థాంక్యూ” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన రాశికన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వరకూ క్లైమాక్స్ కి చేరుకుంది. థాంక్యు సినిమా అయిన వెంటనే పరుశురాం ప్రాజెక్ట్ లో నాగచైతన్య నటించనున్నట్లు… నాగ చైతన్య సరసన రష్మిక మందన హీరోయిన్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి “గీతగోవిందం” సినిమా తర్వాత పరుశురాం నాగచైతన్యతో ప్రాజెక్ట్ ఓకే చేసినట్లు ఆ సినిమాని 14 రీల్స్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే మహేష్ తొందరగా పెట్టడంతో .. నాగచైతన్య ప్రాజెక్టు పక్కనపెట్టి మహేష్ ప్రాజెక్టుని పరశురాం తెరపైకి తీసుకు వచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు రావడం జరిగింది. ఏది ఏమైనా “సర్కారు వారి పాట” తర్వాత డైరెక్టర్ పరుశురాం నాగ చైతన్య సినిమా చేయనున్నట్లు ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతుంది.


Share

Related posts

NTR 30: `ఎన్టీఆర్ 30`లో ఆ హీరోయిన్ ను వ‌ద్దే వ‌ద్దంటున్న అభిమానులు!?

kavya N

Jaathi Ratnalu : జాతి రత్నాలు సినిమా నిండా నవ్వులు నింపిన దర్శకుడి జీవితంలో కన్నీళ్లు తెలుసా?

siddhu

త్రిష ఆ హీరోని పెళ్ళి చేసుకోబోతుందా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar