29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR: ఆస్కార్ గెలిచిన తర్వాత మరో రికార్డు సృష్టించిన “RRR”..!!

Share

RRR: ప్రపంచ ప్రతిష్టాత్మక సినిమా అవార్డు ఆస్కార్ “RRR” గెలవడం తెలిసిందే. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించింది. దీంతో దేశ ప్రధాని మోడీ మొదలుకొని సినీ ప్రముఖులు సెలబ్రిటీలు “RRR” సినిమా యూనిట్ నీ పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ ప్రభుత్వం “RRR” సినిమా యూనిట్ నీ సత్కరించడానికి కూడా రెడీ అవుతూ ఉంది. ఇదిలా ఉంటే గత ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా… ఇప్పటికీ కూడా రికార్డుల క్రియేట్ చేస్తూ ఉంది. పూర్తి విషయంలోకి వెళ్తే జపాన్ లో కొద్ది నెలల క్రితం “RRR” విడుదల కావడం తెలిసిందే.

After winning the Oscar, another record was created by RRR

గత ఏడాది అక్టోబర్ 21వ తారీకు నాడు..”RRR”.. జపాన్ లో రిలీజ్ అవ్వగా.. 20 వారాలుగా ప్రదర్శించబడుతుంది. దీంతో ఇప్పటివరకు ₹80 కోట్లకు పైగా.. వసూలు రాబట్టింది. జపాన్ దేశంలో అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా… అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. “RRR” విడుదలయ్యాక రజనీకాంత్ ముత్తు రికార్డులు బ్రేక్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆస్కార్ అవార్డు రావడంతో జపాన్ దేశంలో మరింత కలెక్షన్స్ వస్తున్నట్లు సమాచారం. ఇండియాలో గత ఏడాది మార్చి నెలలో విడుదలైన “RRR”… వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

After winning the Oscar, another record was created by RRR

బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ వసూలు రాబట్టింది. బాహుబలి సినిమాతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి…”RRR” తో… గ్లోబల్ పరంగా టాప్ దర్శకుడిగా… పేరు సంపాదిస్తున్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలు సైతం జక్కన్నతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. “RRR” రాజమౌళికి అదేవిధంగా భారతీయ చలనచిత్ర రంగానికి అద్భుతమైన పేరు ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చింది.


Share

Related posts

PSPK 27 : 17 వ దశాబ్దం లో పవన్ కల్యాణ్ – క్రిష్ సినిమా .. హై వోల్టేజ్ యాక్షన్ సీన్ లు తీస్తున్నారు

bharani jella

అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు

Siva Prasad

KGF 2: ఈసారి పక్కా కేజీఎఫ్ సీక్వెల్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి యష్ రెడీ

GRK