Samantha: హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురికావడం తెలిసిందే. ప్రమాదకరమైన స్థాయిలో ఉన్న సమయంలో బయటపడిన ఈ వ్యాధి గురించి గత ఏడాది అక్టోబర్ నెలలో తెలియజేయడం జరిగింది. ఈ వ్యాధి గురికాకముందు సమంతా కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న తరహాలో ఫుల్ బిజీగా ఉంది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు రకరకాల జోనర్ కలిగిన సబ్జెక్టు కలిగిన ప్రాజెక్టులు చేయడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా “ఫ్యామిలీ మెన్” అనే వెబ్ సిరీస్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇంకా “పుష్ప” సినిమాలో ఐటెం సాంగ్ చేసి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించింది. “ఊ అంటావా ఊఊ అంటావా” అనే సాంగ్ కి అదిరిపోయే స్టెప్పు లేసి బ్రోతలూగించింది. అనంతరం బాలీవుడ్ తో పాటు దక్షిణాదిలో పలు సినిమాలో చేస్తూ వస్తుంది. శివ నిర్వణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఖుషి, యశోద ఇంకా పలు సినిమాలు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ వ్యాధి గురైన సమయంలో “యశోద” కంప్లీట్ చేసి చికిత్స తీసుకుంటానే డబ్బింగ్ చెప్పడం జరిగింది. అయితే ఈ సినిమా విడుదలయ్యి సమంత కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది.
అయితే దాదాపు మూడు నెలల నుండి మంచానికి పరిమితమైన సమంత ఇటీవల జిమ్ లో వర్క్ అవుట్ లు… చేస్తూ మళ్ళీ పుంజుకుంటూ ఉంది. గతంలో స్లిమ్ గా ఉండటానికి అనేక వర్కౌట్స్ చేసి చాలా చాలాకీ గా ఉండేది. కానీ వ్యాధికి గురైన తర్వాత… మొత్తానికి తలడి వెళ్లిపోయింది. అడిగేయడానికి ఇంకా ఎక్సర్సైజు చేయడానికి అనేక ఇబ్బందులు పడింది. ఆ టైంలో సమంత అభిమానులు ఎంతగానో బాధపడ్డారు. కానీ లేటెస్ట్ గా సమంత ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో తాను ఎక్విప్మెంట్ ఉపయోగించుకుని భుజాలతో స్క్వాట్స్..పుల్ అప్స్ చేస్తూ వీడియోలో కనిపించింది. దీంతో యధావిధిగా మళ్లీ సమంతా ఆరోగ్యం లైన్ లో పడినట్లు.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.