మళ్లీ రచ్చ మొదలు పెట్టిన శ్రీరెడ్డి

బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై వివాదం రేగిన సమయంలోనే శ్రీరెడ్డి టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌కు శ్రీకారం చుట్టారు. రానా సోద‌రుడు, ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్‌బాబు త‌న‌యుడు అభిరాం త‌న‌కు సినిమాల్లో అవ‌కాశాలు ఇప్పిస్తాన‌ని చెప్పి వాడుకున్నాడ‌ని ఆమె ఆరోప‌ణ‌లు చేయ‌డ‌మే కాకుండా ఇద్ద‌రూ క‌లిసి ఉండే కొన్ని ఫోటోల‌ను చూపించి ఇండ‌స్ట్రీని షేక్ చేసింది. అంతే కాకుండా ఫిలించాంబ‌ర్ ముందు అర్ధ న‌గ్నంగా దీక్ష‌కు కూడా దిగింది.తనతో కోరిక తీర్చుకుని అవకాశాలు  ఇవ్వని వారి గుట్టు బయట పెడతానని కూడా చెప్పడంతో అందరూ హడలెత్తారు.  దీంతో ఇండ‌స్ట్రీ అంతా ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టుకుంది. అయితే శ్రీరెడ్డి తన వ్య‌వ‌హారంలో అన‌వ‌స‌రంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను లాగ‌డం… అత‌న్ని దూషించ‌డంతో క‌థ అడ్డం తిరిగింది. స్వ‌యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ రంగంలోకి దిగ‌డం.. ఆయ‌న‌కు బాస‌ట‌కు మెగా హీరోలు రావ‌డంతో అంద‌రూ..  ఇండస్ట్రీ  అంతా ఏకమైంది. శ్రీరెడ్డి  ఒంటరిదైంది.  ఓ రకంగా అప్పటి వరకు శ్రీరెడ్దికి సపోర్ట్ చేసిన మీడియా కూడా ముఖం చాటేసింది. మరో పక్క పవన్‌పై నోరు పారేసుకున్నందుకు అందరూ శ్రీ రెడ్డిని దూషించారు. దాంత అసలు వ్య‌వ‌హారం ప‌క్క‌కు వెళ్లింది.

అయితే శ్రీరెడ్డి ఊరుకోకుండా  హైదరాబాద్ నుండి తదుపరి శ్రీరెడ్డి చెన్నైకు మ‌కాం మార్చి ..అక్క‌డ లారెన్స్‌, శ్రీరాం, విశాల్ వంటి వారిపై ఆరోప‌ణ‌ల‌కు దిగింది. కొన్ని రోజుల పాటు కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారం పీక్స్‌లో ఉన్నాకూడా వ్యవహారం సద్దుమణగడంతో శ్రీరెడ్డి.. మళ్లీ హైద‌రాబాద్ చేరుకున్నారు. రాగానే సురేష్‌బాబు కుటంబంపై విరుచుకుప‌డ్డారు. ఫ్యామిలీ, ప‌రువు, బుద్ధి, జ్ఙానం వంటి విష‌యాల గురించి మాట్లాడే సురేష్‌బాబు, కొడుకుల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీద‌కు వ‌దులుతాడా? అంటూ ఆరోప‌ణ‌ల ప‌ర్వం మొద‌లు పెట్టారు. దీనికి తోడు త్రిషతో రానా, త‌న‌తో అభిరాం ఉన్న ఫోటోను సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. రామానాయుడు స్టూడియో అడ్డాగా జ‌రిగే చ‌ర్య‌ల్లో ఆయన మనవళ్లు ఇద్ద‌రూ తాత‌ను మించిపోయార‌ని కామెంట్ చేసింది శ్రీరెడ్డి. మ‌రి ఇప్పుడు సురేష్ బాబు దీనిపై వివ‌ర‌ణ ఇస్తారో లేక‌.. ప‌ట్ట‌న‌ట్లు కామ్‌గా ఉండిపోతారో చూడాలి.