Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి హీరోగా “వాల్తేరు వీరయ్య” సినిమా జనవరి 13వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. నిన్న సాయంత్రం “వాల్తేరు వీరయ్య” థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయింది. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చిరంజీవి డైలాగ్ డెలివరీ ఉత్తరాంధ్ర శ్రీకాకుళం యాస భాషలో కనిపిస్తోంది. మంచి కామెడీ తరహాలో సినిమా తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. డ్రగ్స్ సరఫరా చేసే దొంగ పాత్రలో చిరంజీవినీ ట్రైలర్ లో చూపించారు.

మాస్ మహారాజ రవితేజని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక నేడు విశాఖపట్నంలో జరగనుంది. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య సినిమా యూనిట్ కి ఏపీ పోలీసులు షాకులు మీద షాక్ లు ఇచ్చారు. ఈ కార్యక్రమం మొదట విశాఖ ఆర్కే బీచ్ లో జరగాల్సి ఉండగా… పోలీసులు ఏయూలో నిర్వహించుకోవాలన్నారు. స్వయంగా సిపి… చిరంజీవికి ఫోన్ చేసి విషయం తెలియజేశారు. కాగా తొలుత ఆర్కే బీచ్ లో పెడతామని.. పోలీసుల అనుమతి సినిమా యూనిట్ కోరగా పరిమిషన్ ఇవ్వలేదు. ఆ సమయంలో ఏయూలో జరుపుకోవాలని అన్నారు. ఆ తర్వాత ఆర్కే బీచ్ లో పర్మిషన్ ఇవ్వడం జరిగింది.

ఇప్పుడేమో ఏయూ లోనే ఈవెంట్ ఫైనల్ చేయడం జరిగింది. దీంతో “వాల్తేరు వీరయ్య” వేదిక మార్పు విషయంలో సినిమా మేకర్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. “శంకర్ దాదా ఎంబిబిఎస్” తర్వాత అటువంటి కామెడీ జోనర్ ఈ సినిమాలో ఉంటుందని చిరంజీవి చెప్పటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు కూడా సినిమాకి హైలెట్ కావటంతో.. “వాల్తేరు వీరయ్య” చూడటానికి మెగా ఫాన్స్ మంచి జోష్ మీద ఉన్నారు.