Unstoppable 2: “ఆహా” ఓటిటిలో “అన్ స్టాపబుల్” టాకీ షో ఎన్నో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఓటిటిలలో రికార్డు స్థాయి వ్యూస్ .. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా “అన్ స్టాపబుల్” రాబట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా బాలకృష్ణ ఫస్ట్ టైం హోస్ట్ కావటంతో “అన్ స్టాపబుల్” ఫస్ట్ సీజన్ పై అందరూ ఆసక్తి కనబరిచారు. దీంతో వెండి తెరపై మాదిరిగానే ఓటీటీలో కూడా తనకు తిరుగు లేదని ఈ టాకీ షో డీల్ చేయడంలో కామెడీ పండించడంలో బాలకృష్ణ తిరుగు లేదని నిరూపించుకున్నారు.
దీంతో “అన్ స్టాపబుల్ 2” టాకీ షో కోసం ఆడియన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కొద్దిరోజుల క్రితం “అన్ స్టాపబుల్ 2” లోగో లాంచ్ చేయటం జరిగింది. ఆ తర్వాత విజయవాడలో “అన్ స్టాపబుల్ 2” టీజర్ రిలీజ్ చేశారు. కాగా నేడు కొద్ది నిమిషాల క్రితం “అన్ స్టాపబుల్ 2” ఈ నెల 14 నుండి స్టార్ట్ కానుంది. ఈ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం “అన్ స్టాపబుల్ 2” ఎపిసోడ్ లు స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా అధికారంగా తెలిపింది.
ఇదిలా ఉంటే రెండో సీజన్ మొదటి ఎపిసోడ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్ రానున్నట్లు.. త్వరలో “అన్ స్టాపబుల్ 2” చంద్రబాబు ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇంకా ఈ సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, నాగార్జున, బాలకృష్ణ మరి కొంతమంది టాప్ హీరోలు సైతం రానున్నట్లు టాక్. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ మరింతగా ఆహా టీం ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!