Allu Arjun: ఓటిటి దిగ్గజాలలో “ఆహా” దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కరోనా తరువాత ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల ఆలోచనలు చాలా విభిన్నంగా మారాయి. థియేటర్ లకి బదులు ఓటీటీ లకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో చాలామంది స్టార్ హీరోలు సైతం ఓటీటీ ప్రాజెక్టులు చేయడానికి ముందుకొస్తున్నారు. కొంతమంది పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలలో కూడా కనువిందు చేస్తున్నారు. ఈ తరహా లోనే ఆహాలో… బాలకృష్ణ “అన్ స్టాపబుల్” షో మంచి క్రేజ్ సంపాదించింది. మొదటి సీజన్ ఎంత ఆదరణ దక్కించుకుందో… అదే రీతిలో రెండవ సీజన్ సక్సెస్ సాధించడం జరిగింది.
సినిమా సెలబ్రిటీలను రాజకీయ నాయకులను అద్భుత రీతిలో .. ఎంటర్టైన్మెంట్ పండిస్తూ బాలకృష్ణ షో సక్సెస్.. కావటంలో కీలక పాత్ర పోషించారు. కాగా ఇప్పుడు ఆహా అల్లు అర్జున్ తో సరికొత్త ప్రోగ్రాం చేయడానికి రెడీ అయింది. ఇందుకు సంబంధించి అల్లు అర్జున్ కొత్త లుక్ ఫోటో విడుదల చేసి ట్విట్టర్లో ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేయడం జరిగింది. “ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నీ మీరు మాస్ గా, క్లాస్ గా చూసి ఉంటారు. కానీ ఈసారి బ్లాక్ బస్టర్ లుక్ తో ఆహా మీ ముందుకు తీసుకురాబోతుంది. “ది బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి” అని పోస్ట్ చేయటం జరిగింది. ఆహా లేటెస్ట్ ప్రకటనతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆ కార్యక్రమం ఏంటో మీరే గెస్ చేయండి… ట్విట్టర్లో కామెంట్లు పెట్టండి అని పోస్ట్ పెట్టడం జరిగింది.
ఖచ్చితంగా ఏదో ఒక డ్యాన్స్ కార్యక్రమమని అల్లు అర్జున్ ఫోటో బట్టి అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప 2” అనే సినిమా అల్లు అర్జున్ చేస్తున్నరు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే… “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ మొదటి షెడ్యూల్ షూటింగ్ విశాఖపట్నం తర్వాత హైదరాబాద్ లో జరిగింది. నెక్స్ట్ బ్యాంకాక్ లో దట్టమైన అడవులలో రెండో షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.