ఈమధ్య బాలీవుడ్ మేకర్స్ తమిళ తంబీల సినిమాలపై కన్నేసినట్లున్నారు. తమిళ సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ముఖ్యంగా అజిత్ సినిమాలనే అని చెప్పాలేమో. ఎందుకంటే ఇటీవల అజిత్ చిత్రం ‘వీరమ్’ను విక్కీ కౌశల్ హీరోగా రీమేక్ చేస్తారని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్గా అజిత్ నటించిన మరో చిత్రం ‘వేదాలం’ను కూడా హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నారని టాక్. ఈ రీమేక్‌లో జాన్ అబ్రహం నటిస్తారని అంటున్నారు. మరి ఈ న్యూస్‌పై బాలీవుడ్ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూద్దాం.
previous post
next post