శ్రీదేవి కలని నిజం చేస్తున్నాడు

అతిలోక సుందరి శ్రీదేవి కలని నిజం చేస్తున్నాడు. అదేంటీ ఎప్పుడో మరణించిన శ్రీదేవి కలని అసలు సంబంధం లేని అజిత్ పూర్తి చెయ్యడమేంటని ఆలోచిస్తున్నారా? అదేమీ లేదండి సింప్లిసిటీకి, జెంటిల్ మ్యాన్ అనే పిలుపుకి మారుపేరైన అజిత్, గతంలో ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా తమిళ వెర్షన్ లో గెస్ట్ రోల్ ప్లే చేశాడు. శ్రీదేవి రీఎంట్రీ మూవీగా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాలో అజిత్ కనిపించింది రెండు సన్నివేశాలే అయినా వాటి ఇంపాక్ట్ బాక్సాఫీస్ దగ్గర బాగా కనిపించింది. ఊహించని హిట్ అందించిన అజిత్ కి శ్రీదేవి కృతఙ్ఞతలు తెలుపుతూ తన మాతృభాష అయిన తమిళ్ లో సినిమా నిర్మించాలనుందని, వీలైతే అందులో హీరోగా నటించమని అజిత్ ని అడిగింది.

స్వయంగా శ్రీదేవినే అడగడంతో కాదనలేక పోయిన అజిత్, తనకున్న కమ్మిట్మెంట్స్ పూర్తి అయిన తర్వాత తప్పకుండ ఒక సినిమా చేస్తానని మాటిచ్చాడు. ఆ తర్వాత శ్రీదేవి మరణించడం, అజిత్ తన పనుల్లో బిజీ అయిపోవడం జరిగిపోయాయి. తనకున్న ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేసిన అజిత్, బోణీ కపూర్ కి కాల్ చేసి సినిమా చెయ్యడానికి డేట్స్ ఇచ్చాడు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతున్న ఈ చిత్రం గురించి బోనీకపూర్‌ మాట్లాడుతూ ‘‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రంలో శ్రీదేవితో కలిసి నటించేటప్పుడు అజిత్‌తో పరిచయం అయింది. తన మాతృభాష తమిళంలో ఒక సినిమా చేయాలని, అందులో అజిత్‌ హీరోగా నటించాలని శ్రీదేవి చాలా సార్లు అన్నారు. అజిత్‌తోనూ ఆ విషయాన్ని చెప్పారు. తప్పకుండా నటిస్తానని మాటిచ్చిన అజిత్‌, ఇప్పుడు పిలిచి మరీ తమిళ సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చారు. శ్రీదేవి కలను అజిత్‌ నెరవేర్చుతున్నందుకు కృతఙ్ఞతలు తెలిపారు. హిందీలో అమితాబ్ నటించిన పింక్ సినిమాకి రీమేక్ రానున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా, బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ హీరోయిన్ గా నటిస్తోంది.