Chor Bazzar: ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన “చోర్ బజార్” శుక్రవారం విడుదల కావటం చేసింది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నటన పరంగా ఉన్న కొద్ది ఆకాష్ పూరి పైకి వస్తున్నాడని అదరగొట్టే యాక్టింగ్ చేశాడని సినిమా చూసిన జనాలు అంటున్నారు. ఫైట్స్ పరంగా “చోర్ బజార్” చాలా కొత్తగా ఉందని తెలిపారు. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో తాజాగా ఆకాష్ పూరి ఒక కొత్త విషయాన్ని బయటపెట్టారు. సినిమాలో సీనియర్ నటి అర్చన.. ఒప్పుకుంటారో లేదో డైరెక్టర్ జీవన్ రెడ్డి తో పాటు నేను కూడా టెన్షన్ పడ్డాను. అయితే ఒక సారి ట్రై చేద్దామని సినిమా ప్రారంభంలో డైరెక్టర్ జీవన్ రెడ్డి ఆమెకి క్యారెక్టర్ తెలియజేస్తే వెంటనే ఒప్పుకున్నారు. ఈ విషయాన్ని జీవన్ రెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే నేను నాన్నకి చెప్పాను, అర్చన గారు సినిమాలో చేస్తానని ఒప్పుకున్నారు అని.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ విషయం చెప్పగానే మా నాన్నగారు నాకు ఒక విషయాన్ని గుర్తు చేశారు. అర్చన గారు అప్పట్లో అటువైపు వెళ్తున్నారని ఆమెను చూడాలని … గేటు పైకి ఎక్కి ఎగిరెగిరి చూస్తుండగా వెనకనే వాచ్ మెన్ వచ్చి లాఠీతో.. కొట్టారు అని నాన్న చెప్పారు అంటూ కొత్త విషయాన్ని ఆకాష్ పూరి ఇటీవల తెలిపారు. అర్చన గారు ఒప్పుకోవడం.. నిజంగా నాన్నతో పాటు నాకు కూడా షాక్ అనిపించింది.. అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సినిమా ప్రీ రిలీజ్ వేడుక టైంలో.. ఆకాష్ పూరి పెద్ద స్టార్ హీరో కావాలని చాలామంది అన్నవారిలో అర్చన గారు కూడా ఉండటం జరిగింది.
పూరి జగన్నాథ్ కొడుకుగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన ఆకాష్ కి “చోర్ బజార్” గత సినిమాల కంటే మంచి పేరు తీసుకు వచ్చిందని చూసిన జనాలు అంటున్నారు. ముఖ్యంగా నటన పరంగా ఇంకా ఫైట్స్ పరంగా అన్ని రకాలుగా ఆకాష్ పూరి ఈ సినిమాలో ప్రేక్షకులను అలరించాడని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా చాన్నాళ్ళ నుండి ఒక మంచి విజయం సాధించాలని అనుకుంటున్న ఆకాష్ పూరికి “చోర్ బజార్” బ్రేక్ ఇచ్చినట్లే అని అంటున్నారు. ఈ సినిమా విజయం సాధించాలని ఆకాష్ పూరి మంచి పేరు రావాలని పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, బండ్ల గణేష్, విశ్వక్ సేన్.. ఇంకా చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది.