Akhanda Movie: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా, శ్రీకాంత్ విలన్‌గా నటించారు. పూర్ణ, జగపతిబాబు కీలక పాత్రలను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతోంది.
ద్విపాత్రాభినయంలో బాలయ్య నటన, బోయపాటి డైరెక్షన్, తమన్ అందించిన మ్యూజిక్ ప్రధానంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఈ సినిమానూ యాబై రోజులు ఆడలేదు. కానీ, ప్రస్తుతం ఉన్న క్లిష్ఠ పరిస్థితులను దాటుకుని అఖండ చిత్రం నేటితో యాబై రోజులను పూర్తి చేసుకుంది.
దీంతో బాలయ్య స్టామినా చూసి నందమూరి ఫ్యాన్స్ సంబర పడిపోతుంటే.. మెగా ఫ్యాన్స్ మాత్రం కాస్త కుల్లుకుంటున్నారని టాక్. ఈ క్రమంలోనే 50వ రోజు అఖండ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే మెగా ఫ్యాన్స్ ఏమైపోతారో అంటూ బాలయ్య అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి వరల్డ్ వైడ్‌గా 49 రోజుల్లో అఖండ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నైజాం- 20.99 కోట్లు
సీడెడ్- 15.87కోట్లు
ఉత్తరాంధ్ర- 6.33కోట్లు
తూర్పు గోదావరి- 4.22కోట్లు
పశ్చిమ గోదావరి- 4.27కోట్లు
గుంటూరు- 4.80 కోట్లు
కృష్ణ- 3.66 కోట్లు
నెల్లూరు- 2.64 కోట్లు
————————————————————–
ఏపీ+తెలంగాణ- 62.78 కోట్లు (104.37కోట్లు~ గ్రాస్)
————————————————————–
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా: 5.07కోట్లు
ఓవర్సీస్ – 5.71 కోట్లుస
————————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్: 73.56కోట్లు(129.40కోట్లు~ గ్రాస్)
————————————————————————
మొత్తానికి 54 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన అఖండ.. ఇప్పటి వరకు 19.56 కోట్ల లాభాలను ఖాతాలో వేసుకుని రికార్డులు తిరగరాస్తోంది. కాగా, ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లాస్ హాట్ స్టార్ దక్కించుకుంది. అయితే హాట్‌స్టార్‌లో అఖండ జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతోంది.