Akhil akkineni: అఖిల్ అక్కినేని కెరీర్లో ఇప్పటివరకు చేసింది నాలుగు సినిమాలు. అఖిల్, మిస్టర్ మజ్ఞు, హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. వీటిలో మొదటి మూడు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇక ఇటీవల వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా మాత్రం మంచి కమర్షియల్ హిట్ సాధించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు – వాసు వర్మ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాతో అఖిల్ ఎదురు చూసిన సక్సెస్ అందుకున్నాడు.
అయితే ఈ సినిమాలన్నీ అంత మాస్ సినిమాలు కాదు. కాస్త యాక్షన్ జోడించిన క్లాస్ సినిమాలు. కానీ అఖిల్‌కు ఇప్పుడు కావాల్సింది పక్కా మాస్ ఇమేజ్. అందుకే దర్శకుడు సురేందర్ రెడ్డిని అక్కినేని అభిమానులు మీ సినిమాలో అఖిల్‌ను మాస్ హీరోగా చూపించమని అభ్యర్ధిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో మాదిరిగా క్లాస్ హీరో రోల్లో చూపిస్తామంటే ఏమాత్రం ఒప్పుకోమని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా దర్శకుడు సురేందర్ రెడ్డికి రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు. అంతేకాదు ఎలాంటి రోల్లో చూపించాలో రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు.
Akhil akkineni: స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఏజెంట్..!
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం లాంటి సినిమా కావాలని కోరుతున్నారు. హలో వంటి సినిమా అయితే చూడమని నేరుగానే దర్శకుడు సురేందర్ రెడ్డికి చెబుతున్నారు. అయితే అభిమానులు అడగకముందే అఖిల్ ఏజెంట్ అనే హై ఓల్టేజ్ మాస్ ఎంటర్టైనర్ను తెరకెక్కించడం మొదలు పెట్టారు. ఇందులో అఖిల్ మేకోవర్ మెస్మరైజింగ్ చేసింది. 8 ప్యాక్స్‌తో అఖిల్ ఏజెంట్ మూవీ లుక్ అదిరిపోయింది. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి అఖిల్ అభిమానులను ఈ సినిమా ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.