మిస్టర్ మజ్ను సినిమాతో కెరియర్‌లో ఫస్ట్ హిట్ అందుకోవాలని చూస్తున్న అఖిల్ అక్కినేని. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. విక్కీ, నిక్కీ పాత్రల్లో అఖిల్, నిధి అగర్వాల్ నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని చూస్తుంటే రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీనే మళ్లీ చూస్తున్నట్లు ఉంది. మొదటిసారి ప్లే బాయ్ పాత్రలో కనిపించనున్న అఖిల్, అందుకు తగ్గట్లు పూర్తిగా రెడీ అయ్యాడు.ట్రైలర్ లోని మ్యూజిక్ చాలా బాగుంది, ఫారిన్ లో షూటింగ్ చేయడం వలన రిచ్ ఔట్పుట్ వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒక మంచి ఎంటెర్టైమెంట్ తో పాటు ప్యూర్ లవ్ స్టోరీ చూడబోతున్నామనే ఫీలింగ్ కలిగించిన అఖిల్, వెంకీ అట్లూరి దాన్ని అలానే కంటిన్యూ చేస్తే హిట్ కొట్టినట్లే.
previous post
మరోసారి మహేష్, త్రివిక్రమ్