
Akhil Akkineni: లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న అక్కినేని అఖిల్ తొలిసారి యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి ఏజెంట్ సినిమా తో ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అయింది. స్పై యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడి బాడీ బిల్డప్ చేశాడు కూడా. దీంతో ఏజెంట్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా సురేందర్ రెడ్డి వంటి స్టైలిష్ డైరెక్టర్ తీయడం వలన అఖిల్ అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
ఏజెంట్ సినిమా రన్‌టైమ్ 2 గంటల 36 నిమిషాలు . స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర పోషించగా.. సాక్షి వైద్య హీరోయిన్‌గా చేసింది. ఏజెంట్ సినిమాకు అక్కినేని అఖిల్ తీసుకున్న రెమ్యునరేషన్ కాస్త ఎక్కువ అని అంటున్నారు. భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ కేవలం ఆరు ఏడూ కోట్ల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు.

కాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనిలివ్ 11 కోట్లకు కొనుగోలు చేసింది . ఏజెంట్ మూవీ ఎప్పుడు OTT లోకి వస్తుందో తెలియడం లేదు. చాలా సార్లు OTT డేట్ ఇచ్చి సోనీలివ్ రిలీజ్ ఐతే చేయలేదు. దీనికి రకరకాల కారణాలు చెప్పారు. డైరెక్టర్ ఏవో కొన్ని మంచి సీన్స్ ని జోడించి బాగా ఎడిట్ చేసి వదులుతాడని అన్నారు. కానీ అలా రిలీజ్ కాలేదు. ఈ సినిమా ని టీవీ లో చూద్దాం అనుకున్నవాళ్ళకి నిరాశే మిగిలింది. ముందుగా ‘ఏజెంట్’ మూవీని మే చివరి నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంచాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కానీ అది వాయిదాపడింది. ఈ ఆలస్యానికి కారణమేంటని ఆరా తీస్తే..సురేందర్ రెడ్డి మూవీకి తుది మెరుగులు దిద్దుతున్నాడని అనుకున్నారు. సినిమాను మరోసారి ఎడిట్ చేస్తు.. థియేట్రికల్ రిలీజ్ టైమ్‌లో తొలగించిన సీన్లను జోడిస్తున్నాడని కూడా ఒక వార్త వచ్చింది.
ఏజెంట్ కథ కూడా ఎదో కొత్త ది కాదు. కధనం లోనూ కొత్తేమీ లేదు. చిన్నతనం నుంచి రీసెర్చ్ అనాలసిస్ వింగ్ (రా)లో ఏజెంట్‌గా చేరాలని కలల కనే రామకృష్ణ అలియాస్ రిక్కీ (అఖిల్ అక్కినేని)అనే యువకుడి కథ ఇది. రా ఛీఫ్ మహదేవ్ (మమ్ముట్టి) సహాయంతో స్పెషల్ ఏజెంట్‌గా మారిన రామకృష్ణ… ధర్మ (డినో మోరియో) అనే దేశద్రోహి కుట్రలను ఎలా అడ్డుకున్నాడన్నదే ఈ సినిమా కథ. రొటీన్ కాన్సెప్ట్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది.
అక్కినేని ఫ్యామిలీ హీరోలకు రొమాంటిక్ ఇమేజ్ ఉంది. అయితే, తనకు యాక్షన్ సినిమాలు అంటే ఇష్టమని అఖిల్ అక్కినేని చెప్పాడు. . ‘ఏజెంట్’ కోసం వైల్డ్ యాక్షన్ హీరోగా అయిపోయారు. సిక్స్ ప్యాక్ చేశారు. హెయిర్ స్టైల్ మార్చారు. ఆయనకు తోడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించినా కూడా జనాలకునచ్చలేదు.

‘రా’ సినిమాల్లో కథలు, కథాంశాలు ఒకేలా ఉన్నప్పటికీ… థియేటర్లలో చివరి వరకూ కూర్చోబెట్టే ఒకే ఒక్క ఎమోషన్ దేశభక్తి. ప్రేక్షకుడిలో దేశభక్తిని బలంగా బయటకు రప్పించగలిగితే చాలు… సినిమా హిట్టే. అందుకు రీసెంట్ ‘పఠాన్’ ఉదాహరణ. ఆ సినిమా ప్రస్తావన ఎందుకంటే… ‘ఏజెంట్’లో కొన్ని సన్నివేశాలు, క్యారెక్టర్లు చూస్తే షారుఖ్ మూవీ గుర్తుకు వస్తుంది. ‘పఠాన్’ విడుదల కంటే ముందు ‘ఏజెంట్’ మొదలు పెట్టారు. అదేమిటో గాని . రెండు సినిమాల్లో కొన్ని పోలికలు మాత్రం ఉన్నాయి.
ఈ సినిమా తేసే ముందు కనీసం హోమ్ వర్క్ చేయలేదనిపిస్తుంది. భారత ఇంటిలిజెన్స్ వ్యవస్థ మీద మరీ చులకన , చిన్నచూపుతో సినిమా తీశారనిపిస్తుంది. కనీసం రీసెర్చ్ కూడా దర్శక, రచయితలు చేసినట్టు లేరు. కామెడీ కాకపోతే… ‘రా’ హెడ్ ఆఫీసులో జరిగే ప్రతి విషయాన్ని సీసీ కెమెరా ఫుటేజ్ చూసినట్టు దేశద్రోహులు చూడటం ఏమిటి? ‘రా’ ఆఫీస్ ముందు ఏకంగా హెలికాఫ్టర్ వేసుకుని దిగటం ఏమిటి? సినిమా కోసం లే అనుకుని ఎంత సరిపెట్టుకుందామనుకున్నా కొన్ని అంశాలు అసలు మింగుడుపడవు. కనీసం దీని కంటే ముందు రా నేపథ్యంలో వచ్చిన యాక్షన్ సీన్లు కాకుండా కథలపై కొంత అవగాహన చేసుకుని , విషయాలు తెలుసుకుని చేస్తే ఇంకా మంచి కథ వచ్చేది!

అక్కినేని అఖిల్ నిజానికి బాగానే ఉంటాడు. ఎంతో కొంత యా క్షన్ చేయగలడు. కానీ మరీ ఇలాంటి రొటీన్ కధ తో రొటీన్ కధనం తో వస్తే సినిమా ఆడలేదు. జనం ఆశించిన అంశాలు లేవు. కొత్త స్టోరీ గానీ కొత్త కధనం గానీ ఉండాలి. మనసుకు హత్తుకునే సీన్స్ కొన్ని ఉండాలి. లేదా హీరో చాలా టాలెంటెడ్ అయి ఉండాలి. అంచేత సోనీలివ్ వారు కూడా రిలీజ్ చేసేయడానికి ఏమీ కంగారు పడటం లేదన్నమాట. ఎప్పుడు OTT లోకి వస్తుందో తెలీదు. అదీ సంగతి.