Agent: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించిన “ఏజెంట్” సినిమా ఏప్రిల్ 28వ తారీకు విడుదల కానుంది. దీంతో సినిమా విడుదలకు వారం రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాలు చాలా జోరుగా జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో చాలా ఇంటర్వ్యూలలో అక్కినేని అఖిల్ కి విలేకర్ లు కొన్ని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అవి ఏమిటంటే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయినట్లు, అదేవిధంగా డైరెక్టర్ సురేందర్ రెడ్డితో గొడవ జరిగినట్లు, షూటింగ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం మీరే అన్నట్టు ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఈ ప్రశ్నల విషయంలో అఖిల్ కి అసహనం నెలకొన్నట్లు సమాచారం. దీంతో షూటింగ్ ఆలస్యంకి ప్రధాన కారణం.. పాండమిక్ అని అఖిల్ సమాధానం ఇస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఇవే ప్రశ్నలు ఎదురవుతూ ఉండటంతో… మీడియాపై చిరాకు పడలేక ఏం చేయాలో తెలియక.. సైలెంట్ అయిపోతున్నారట. ఇంకా ఈ సినిమా కోసం కేవలం 105 రోజులు మాత్రమే పనిచేసినట్లు స్పష్టం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తన సినిమా ప్రమోషన్స్ కి ప్రభాస్ ఇంకా రామ్ చరణ్ రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో ఆ హీరోలు ట్రైలర్ చూసి ఫోన్ లో మాట్లాడారని… అఖిల్ సమాధానం ఇచ్చారు. కుదిరితే పాల్గొనే ఛాన్స్ ఉందన్నట్టు చెప్పకు వచ్చేది. ఇంక నాగార్జున వంద సినిమాపై కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాగార్జున 100 సినిమాలో తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
ఇద్దరం కలిసి నటిస్తే అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని… అటువంటి సబ్జెక్టు ఉంటేనే చేస్తామని చెప్పుకొచ్చారు. అక్కినేని ఫ్యామిలీలో డాన్స్ ఇంకా ఫైట్స్ పరంగా తిరుగులేని హీరోగా అఖిల్.. చాలా సినిమాలలో నిరూపించుకోవడం జరిగింది. అయినా కానీ సరైన విజయం మనోడికి వరించలేదు. దీంతో “ఏజెంట్” రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ అఖిల్ కి పడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సినిమాలో పాత్ర కోసం అఖిల్ తన బాడీ షేప్ మొత్తం మార్చుకోవటానికి దాదాపు ఏడాదిన్నరకు పైగానే వర్క్ అవుట్లు చేయటం జరిగింది. ఆరు నెలల పాటు డైట్ లో ఉన్నాడు. మరి “ఏజెంట్” ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.