హీరో సిక్స్ ప్యాక్ చూపిస్తే సినిమా హిట్ అవ్వదు…

అక్కినేని వారసుడిగా భారీ అంచనాల మద్య కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్ హీరో అఖిల్, ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే తనకంటూ సొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్న అఖిల్, ఫస్ట్ మూవీనే 40 కోట్ల బడ్జట్ తో తెరక్కింది, వినాయక్ డైరెక్షన్, నితిన్ ప్రొడక్షన్ అవ్వడంతో ఈ ఒక్క సినిమాతోనే అఖిల్ స్టార్ హీరో అయిపోతాడని అందరూ అనుకున్నారు. రిలీజ్ కి ముందు ఉన్న భారీ అంచనాలని తలకిందులు చేస్తూ అఖిల్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. లాభాల మాట, అటుంచితే పెట్టిన డబ్బులు కూడా రాకపోవడంతో అక్కినేని కుర్రాడికి భారీ ఫ్లాప్ తప్పలేదు.

మొదటి సినిమా ఇచ్చిన రిజల్ట్ తో డీలా పడిన అఖిల్, కొంచెం గ్యాప్ తీసుకొని హలో అంటూ ప్రేక్షకులని పలకరించాడు. విక్రమ్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ హలోని తెరకెక్కించడంతో ఈసారి అఖిల్ హిట్ కొట్టడం ఖాయం అనుకున్నారు, కింగ్ నాగ్ అయితే ఏకంగా హలో సినిమాని అఖిల్ రీలాంచ్ మూవీ రేంజులో ప్రొమోషన్స్ చేశారు. ఎన్ని చేసినా కూడా సినిమాలో విషయం లేకపోతే కష్టమే అన్నట్లు, హలో ప్రేక్షకులు ముందుకి వచ్చిన మొదటి రెండు రోజులకే నెగటివ్ టాక్ తెచ్చుకొని, అఖిల్ కెరీర్ లో మరో ఫ్లాప్ గా నిలిచింది. హలో సినిమా రిజల్ట్ కేవలం అఖిల్ కి మాత్రమే కాకుండా నాగార్జునకి కూడా భారీ షాక్ ఇచ్చింది

ఈ రెండు ఫ్లాప్స్ నుంచి తేరుకొని అఖిల్ ఇప్పుడు మిస్టర్ మజ్ను సినిమా చేస్తున్నాడు, ఇప్పటికే మార్కెట్ పూర్తిగా దెబ్బతినడంతో రిస్క్ ఎందుకనుకున్నాడో ఏమో కానీ అఖిల్, అక్కినేని ఫ్యామిలీకి బాగా అచ్చొచ్చిన ప్రేమకథలవైపు అడుగులు వేస్తున్నాడు. ఈ మూవీతో అయినా హిట్ అందుకోవాలని చూస్తున్న అఖిల్, తన బాడీని పూర్తి ఫిట్ గా మార్చుకొని సిక్స్ ప్యాక్ చేశాడు. రీసెంట్ గా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కూడా, అయితే ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ముందు అందులో విషయం ఉండ్లాయ్ కానీ, హీరో డాన్సులు, ఫైట్లు, పాటలు, సిక్స్ ప్యాక్లు చూపిస్తే హిట్ ఇవ్వదు. ఒకవేళ వీటి వల్లనే సినిమా హిట్ అవుతుంది అనుకుంటే అఖిల్ ఈ పాటికే ఇవన్నీ చేసి చూపించాడు కానీ ఉపయోగం లేదు. ఇప్పటికైనా అఖిల్ ఈ విషయాన్ని తెలుసుకొని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే కెరీర్ బాగుంటుంది లేదంటే స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి కెరీర్ నిలబెట్టుకోలేకపోయిన ఎంతో మంది హీరోల లిస్ట్ లో అఖిల్ కూడా చేరిపోతాడు.