తొలి మూడు చిత్రాలు అఖిల్, హలో, మిస్టర్ మజ్ను అనుకున్న మేర అక్కినేని అఖిల్‌కు బ్రేక్‌ను తీసుకురాలేకపోయాయనేది వాస్తవం. దీంతో అఖిల్ ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో నాలుగో సినిమాను బయట బ్యానర్లో చేయాలనుకున్నాడు. అందులో భాగంగా గీతాఆర్ట్స్‌తో చేతులు కలిపారు. అల్లు అరవింద్ సమర్పణలో జి.ఎ.పిక్చర్స్ బ్యానర్‌పై బన్నివాసు, వాసు వర్మ నిర్మాతలుగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాను రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇటీవల సినిమా లాంఛనంగా ప్రారంభమైనప్పటికీ సెట్స్‌పైకి వెళ్లడానికి మాత్రం సమయం తీసుకుంది. కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా సోమవారం ఎట్టకేలకు ప్రారంభమైంది. హైదరాబాద్ కూకటల్పల్లిలోని కొన్ని లొకేషన్స్‌లో అఖిల్‌పై సన్నిశాలను చిత్రీకరించాడు. ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు. దర్శక నిర్మాతలు ఈ విషయంపై ఇంకా కసరత్తులు చేస్తూనే ఉన్నారు. రెండో షెడ్యూల్ స్టార్ట్ అయ్యే నాటికి హీరోయిన్ను ఓకే చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
previous post
next post