Akkineni Akhil: అక్కినేని అఖిల్ కి లక్ అంతగా కలిసిరావట్లేదు. మనం సినిమాలో అఖిల్ ని చూసిన జనం ఇక తిరిగిలేదు అని అనుకున్నారు. దాని తరువాత వచ్చిన ఎంట్రీ సినిమా అఖిల్ సినిమాతో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నాడు మన అక్కినేని వారసుడు. నాగార్జున తన కొడుకులని మాస్ హీరోలుగా తీర్చిదిద్దే పనిలో వున్నా అంతగా కలిసి రావట్లేదు. అయితే అఖిల్ మాత్రం తన ప్రయత్నాన్ని మాత్రం వీడటంలేదు. సినిమా సినిమాకి తనని తాను మలుచుకున్న తీరు న భూతో న భవిష్యతి. ఇక తాజా చిత్రం కోసం అఖిల్ తయారైన విధానాన్ని చూస్తే నిజమైన బీస్ట్ లాగ వున్నాడని అంటారు మీరే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Akkineni Akhil: ఈ సారైనా హిట్టు కొడతాడా?
ప్రస్తుతం అఖిల్ పడిన కష్టం అంతాఇంతాకాదు. నెక్స్ట్ రాబోతున్న చిత్రం కోసం బీస్ట్ లా మాన్ స్టర్ లా మారాడు. హిట్టుకోసం కసితో పోరాడుతున్నారు. ఈసారి కొట్టాలి అన్న పంతం అతడిలో స్పష్ఠంగా కనిపిస్తోంది. కెరీర్ ఆరంభం నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా అతడు ఎంతో కసిగా పని చేస్తున్న విధానాన్ని కొనియాడకుండా ఉండలేం. సినిమా సినిమాకి పరిణతి చెందుతూ ముందుకు సాగుతున్నాడు. అందుకే ఇప్పుడు అతడు అందరి గుండెల్లో బాహుబలుడిగా మారిపోతున్నాడు. ఏజెంట్ మూవీ కోసం అఖిల్ శ్రమిస్తున్న తీరు చూస్తుంటే యాక్షన్ హీరోయిజం లో మరో రేంజును చూపించే పంతం అతడిలో కనిపిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఏజెంట్ సినిమా విశేషాలు
సురేందర్ రెడ్డి – అఖిల్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం అక్కినేని జనాలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. థ్రిల్స్ తో కూడిన సాహసాలు చేసే స్పై కాన్సెప్ట్ కావడంతో ఏజెంట్ రాక కోసం ఇండస్ట్రీ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ సినిమా కోసం అఖిల్ జిమ్ లో మెటల్ మెషినరీని విరిచేస్తూ కనిపిస్తున్నాడు. ఫ్యాన్స్ లోకి జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది ఈ వీడియో. బార్న్ వేటలా సాగే ఏజెంట్ కోసం మీడియా అభిమానులు అంతే ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అఖిల్-సూరి కాంబో ఇంతకీ తెరపై ఏం చూపిస్తారో కాస్త వేచి చూడాల్సిందే మరి.