ప్రస్తుతం చాలా కొత్త సినిమాలు గతంలో ఆల్రెడీ తెరకెక్కిన సినిమాల టైటిల్స్ తో మళ్లీ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ దిశగానే పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “ఖుషి” టైటిల్ తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత నటిస్తుంది. ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ ని తన కొత్త సినిమాకి పెట్టుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం.
పూర్తి విషయంలోకి వెళ్తే.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ కొత్త సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇది అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో.. తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందుమూలంగా ఈ సినిమాకి “తమ్ముడు” అనే టైటిల్ పెట్టే ఆలోచనలో వేణు శ్రీరామ్ ఉన్నారంట. 1999లో పవన్ కళ్యాణ్ హీరోగా “తమ్ముడు” సినిమా వచ్చింది. ఆ టైంలో సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమాలో లాస్ట్ సాంగ్ మరియు బాక్సింగ్ ఫైట్ అప్పట్లో చాలా హైలెట్ గా.. సినిమా బ్లాక్ బస్టర్ అవటంలో కీలక పాత్ర పోషించడం జరిగింది.
ఇప్పుడు ఇదే టైటిల్ తో… అఖిల్ సినిమా చేయనున్నట్లు సమాచారం. వేణు శ్రీరామ్ గతంలో పవన్ కళ్యాణ్ తో “వకీల్ సాబ్” చేయడం జరిగింది. పాలిటిక్స్ నుండి పవన్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాగా తెరకెక్కిన “వకీల్ సాబ్” సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో ఇప్పుడు అఖిల్ తో పవన్ కళ్యాణ్ టైటిల్ తో వేణు శ్రీరామ్ సినిమా చేయటానికి ముందుకు రావడం సంచలనంగా మారింది. సినిమాలో అఖిల్ అక్క పాత్రలో కీలక సీనియర్ హీరోయిన్ నటించనున్నట్లు సమాచారం.