NewsOrbit
Entertainment News సినిమా

Akkineni Akhil: మరో కొత్త ప్రాజెక్టు లైన్ లో పెట్టిన అక్కినేని అఖిల్..?

Share

Akkineni Akhil: అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయమైన అఖిల్ సరైన హిట్టు కొట్టడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. డాన్స్ మరియు ఫైట్స్ పరంగా బెస్ట్ టాలెంట్ ఉన్నా గాని సరైన విజయాన్ని ఇప్పటివరకు అందుకోలేకపోవడం జరిగింది. అక్కినేని కుటుంబం నుండి చాలామంది హీరోలుగా రావటం జరిగింది. కొంతమంది పెద్దగా మెప్పించలేకపోయారు. సుమంత్, సుశాంత్.. ఇద్దరూ ఆకోవకు చెందిన వాళ్లే. ఇప్పుడు అఖిల్ కూడా ఆ జాబితాకే చెందిన హీరో పరిస్థితి అన్నట్టు “ఏజెంట్” సినిమా రిజల్ట్ తర్వాత కామెంట్లు వస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన “ఏజెంట్” ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

akkineni akhil work with uv creations productions under new director

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హై వోల్టేజ్ తరహాలో ఉన్నా గాని…. కథలో దమ్ము లేకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద చతిగలబడింది. ఈ పరిణామంతో మాస్ హీరోగా అనిపించుకోవాలని అఖిల్ చేసిన ప్రయత్నం… అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇటువంటి క్రమంలో అఖిల్ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం యూవి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో అఖిల్ సినిమా చేయబోతున్నారట. ఈ సినిమాలో దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్… హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం.

akkineni akhil work with uv creations productions under new director

అంతేకాదు ఈ సినిమాని కొత్త దర్శకుడు తీయబోతున్నారట. కొత్త డైరెక్టర్ చెప్పిన కథ బాగా నచ్చడంతో అఖిల్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇది చాలా వైవిధ్యమైన స్టోరీ అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఫ్యామిలీ మరియు మాస్ ప్రేక్షకులను అలరించే కథ కావటంతో యూవి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కూడా ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ టాక్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి.. ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేసే విధంగా.. ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసిన మురళీమోహన్..!!

sekhar

Niharika Konidela : వైరల్ అవుతున్న నిహారిక హోలీ సెలబ్రేషన్స్ పిక్స్..!!

bharani jella

Pawan Kalyan: వీరమల్లు సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్..లేటెస్ట్ పిక్స్ వైరల్..

GRK