తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. ఏఎన్నార్, నాగార్జున ఇద్దరూ స్టార్ హీరోలుగా చలామణి అయిన వారే, తమకంటూ ప్రత్యేకమైన అభిమాన ఘనాన్ని సొంతం చేసుకున్న ఈ కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా అక్కినేని అఖిల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. మనం సినిమలో మంచి క్యామియో రోల్ ప్లే చేసి, ‘అఖిల్’ సినిమాతో ఫుల్ లెంగ్త్ హీరోగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ కుర్రాడు భారీ ఫ్లాప్ అందుకున్నాడు. అక్కినేని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలకి కూడా షాక్ ఇచ్చిన ఈ ఫ్లాప్ నుంచి ఏడాది పాటు కోలుకోని అఖిల్, ఈసారి ‘హలో’ అంటూ ఆడియన్స్ ని పలకరించాడు కానీ అది కూడా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు.
అఖిల్ నటించిన మొదటి రెండు సినిమాలు పోవడంతో, అతని మార్కెట్ పూర్తిగా దెబ్బతినింది. తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసిన అఖిల్ ‘Mr.మజ్ను’గా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ రావడంతో అఖిల్… ‘మిస్టర్ మజ్ను’ సినిమాతో హిట్ కొట్టడం ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది కానీ దాన్ని కంటిన్యూ చేయడంలో పూర్తిగా విఫలమయ్యింది. దీంతో అఖిల్ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్ చేరింది. దాదాపు 22కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా 11.13 కోట్ల షేర్ ను మాత్రమే వసూలు చేయగలిగింది. అంటే పూర్తి బిజినెస్ లో సగం మాత్రమే రికవరీ చేయగలిగింది.
స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఫస్ట్ హిట్ అందుకోవడానికి కష్టపడుతున్న అఖిల్ కెరీర్ ని సెట్ చేయడానికి నానా తంటాలు పడుతున్న నాగార్జున, ఈసారైనా అఖిల్ కి హిట్ ఇవ్వాలని మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ నాలుగో సినిమాని ఒక సీనియర్ డైరెక్టర్ తో చేయించాలని నాగ్ ప్రణాళిక రచిస్తున్నాడు. మరి ఆ సీనియర్ డైరెక్టర్ అయినా ఈ అక్కినేని కుర్రాడికి మొదటి హిట్ ఇస్తాడేమో చూడాలి
previous post
next post