కెరీర్ స్టార్టింగ్ లోనే భారీ ఫ్లాప్స్ ఫేస్ చేసి మార్కెట్ పరిధిని తగ్గించుకున్న అక్కినేని అఖిల్, ఈసారైనా హిట్ అందుకోవాలని చేసిన సినిమా ‘మిస్టర్ మజ్ను’. తొలిప్రేమ లాంటి హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో తెరకెక్కిన మిస్టర్ మజ్ను రిపబ్లిక్ డే కనుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ మూడో సినిమాతో అయినా అఖిల్ హిట్ అందుకున్నాడేమో చూద్దాం.
కథ :
మిస్టర్ మజ్ను సినిమాలో అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆవేశపరిచే అంశాలు, ప్రయోగం అనిపించే కథా కథనాలు లాంటి ఎలిమెంట్స్ ఏమీ లేవు. ఈ సినిమా ఒక సింపుల్ లవ్ స్టోరీ. లండన్ లో ప్లేబాయ్ గా తిరిగే విక్రమ్ కృష్ణ(అక్కినేని అఖిల్)కి, నిఖిత(నిధి అగర్వాల్)కి మధ్య ఏం జరిగింది అనేదే ఈ మిస్టర్ మజ్ను కథ. ప్లే బాయ్ అయినా కూడా విక్కీ లో మంచి వ్యక్తిత్వం చూసిన నిక్కీ, అతన్ని సిన్సియర్ గా లవ్ చేస్తుంది. ఇది అర్ధం కానీ విక్కీ, నిక్కీ ప్రేమని ఒప్పుకోకుండా ఆమెని దూరం చేసుకుంటాడు. తీరా నిక్కీ దూరమయ్యే సమయానికి, తను కూడా నిఖితాని ప్రేమిస్తున్నాననే విషయం గుర్తించిన విక్కీ దూరమైన ప్రేమ కోసం ఏం చేశాడు..? తన ప్రేమని ఎలా గెలిపించుకున్నాడు? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
కెరీర్ లో మొదటి హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్, అక్కినేని ఫ్యామిలీ ట్రేడ్ మార్క్ అయిన మంచి రొమాంటిక్ ప్రేమకథ దొరకడంతో విక్కీ పాత్రలో ఆకట్టుకున్నాడు. ప్లేబాయ్ పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయిన అఖిల్ స్క్రీన్ పై చాలా ఎనేర్జిటిక్ గా కనిపించాడు. మొదటి సినిమాతోనే ఫైట్స్, డాన్స్ చేయగలనని ప్రూవ్ చేసుకున్న అఖిల్, మిస్టర్ మజ్ను సినిమాతో తనలో మంచి నటుడున్నాడని అందరికీ తెలియజేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపించినా ఓవరాల్ గా చాలా డెవలప్ అయ్యాడు. ఇక తన డెబ్యూ మూవీ సవ్యసాచితో ఫ్లాప్ అందుకున్న నిధి అగర్వాల్, నిఖిత పాత్రలో ఒదిగిపోయింది. గ్లామర్ గా కనిపిస్తూనే యాక్టింగ్ కి స్కోప్ ఉన్న ప్రతి సీన్ లో నటించి మెప్పించింది. మిగిలిన పాత్రల్లో కనిపించిన వారిలో సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకోగా సుబ్బారాజు, ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీ సో సోగానే ఉంది.
విశ్లేషణ :
తొలిప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి, మిస్టర్ మజ్ను సినిమాతో ఈతరం ప్రేమకథాని ఎంచుకున్నాడు. కథలో కొత్తదనం లోపం స్పష్టంగా కనిపిస్తుంది, ప్రతి సీన్ ఎక్కడో చూసినట్లు అనిపిస్తూనే ఉంటుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ పైన పెట్టిన శ్రద్ధ కథాకథనాల్లో పెట్టి ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే సాగదీసినట్లు అనిపిస్తుంది. నిజమైన ప్రేమ అంటేనే అర్ధం చేసుకోలేని హీరో చేంజ్ అయ్యే జర్నీ కానీ క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కానీ కన్వీన్సింగ్ గా అనిపించవు. డైరెక్టర్ గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన వెంకీ అట్లూరి, రైటర్ గా మెప్పించాడు. ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ హార్ట్ టచింగ్ గా అనిపిస్తాయి. సినిమా ఫారిన్ లో తెరకెక్కించడం వలన తెరపై చాల రిచ్ నెస్ కనిపిస్తుంది. గత కొంత కాలంగా మంచి మ్యూజిక్ ఇస్తున్న తమన్ మరోసారి మెప్పించాడు. ముఖ్యంగా అతనిచ్చిన బీజీఎమ్, సీన్స్ ని మరోస్థాయికి తీసుకెళ్లింది. ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఫైనల్ గా చెప్పాలి అంటే మిస్టర్ మజ్ను సినిమా అఖిల్ ని ఫ్లాప్స్ నుంచి అయితే తప్పించింది కానీ ప్రేక్షకులని మెప్పించడంలో మాత్రం కొంచెం వీక్ అయ్యింది.
ప్లస్ పాయింట్స్ :
లీడ్ పెయిర్ యాక్టింగ్
సినిమాటోగ్రఫి
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్టోరి
సెకండ్ హాఫ్
వీక్ రైటింగ్
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!