Kushi: చాలాకాలం తర్వాత హీరోయిన్ సమంత “ఖుషి” సినిమాతో విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమా రాకమందు యశోద, శాకుంతలం సినిమాలతో రెండు పరాజయాలు అందుకోవటం జరిగింది. అంతేకాదు ఈ రెండు సినిమాలకు ముందు సమంత మయాసైటిస్ అనే ప్రాణాంతకర వ్యాధి బారిన పడటం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ నెలలో ఈ వ్యాధి బారిన పడిన సమంత.. దాదాపు ఆరు నెలల పాటు మంచానికి పరిమితం అయింది. ఈ క్రమంలో ప్రమాదకరమైన ఈ వ్యాధికి సమంత తీసుకున్న ట్రీట్మెంట్.. ఆమె గ్లామర్ కి దెబ్బ వేసింది. సమంత అనారోగ్యానికి గురైన సమయంలో అక్కినేని ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఆమె త్వరగా కోలుకోవాలని పోస్టులు కూడా పెట్టారు.
అక్కినేని అఖిల్ అయితే సమంత త్వరగా కోలుకోవాలని స్పెషల్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే చాలా కాలం తర్వాత కోలుకున్న సమంత ఇటీవల విజయ్ దేవరకొండ తో నటించిన ఖుషి సినిమాతో హిట్ అందుకోవటం తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా… కెరియర్ పరంగా సమంతకి మంచి బ్రేక్ ఇచ్చింది. చాలాకాలం తర్వాత సమంతకి విజయం వరించటంతో అక్కినేని ఫ్యామిలీ నాగార్జున, అమల, అఖిల్, నాగచైతన్య ఏఎంబి థియేటర్ లో సమంత కోసం ఈ సినిమా చూస్తున్నట్లు టాక్.
నాగచైతన్యతో వ్యక్తిగత విభేదాలతో సమంత విడిపోయిన గాని..సామ్ నీ అక్కినేని ఫ్యామిలీ ఎంతగానో గౌరవించడం తెలిసిందే. చైతుతో విడాకులు తీసుకున్న తర్వాత చాలా సందర్భాలలో అక్కినేని కుటుంబ సభ్యులు సమంతా పట్ల సానుకూలంగానే స్పందించారు. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత కెరియర్ పరంగా అనారోగ్యం నుండి బయటపడి హీరోయిన్ గా ఖుషి సినిమాతో సమంత హిట్ అందుకోవటంతో అక్కినేని ఫ్యామిలీ కూడా ఆనందంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. చాలాకాలం త్వరగా ఫ్రెష్ లవ్ స్టోరీ సబ్జెక్టులో ఖుషి సినిమాలో సమంత అద్భుతమైన నటనతో గ్లామర్ తో.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.